రామ్ చరణ్ మళయాళి కథలపై మనసు పారేసుకున్నాడు. బావ అల్లు అర్జున్ తెలుగు కథలతో కేరళ వెళ్తుంటే.. బావమరిది చరణ్ మాత్రం మళయాళి కథలను తెలుగులోకి తీసుకొస్తున్నాడు. వరుసగా మల్లూ సినిమా హక్కులు తీసుకుంటున్నాడు. కొణిదెల కంపెనీలో కేరళ కథలు ప్లాన్ చేస్తున్నాడు చెర్రీ. 


రామ్ చరణ్ కేరళ కథలపై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మళయాళీ సినిమాలను చేసేందుకు కోట్లు చెల్లిస్తున్నాడు. వైవిధ్యమైన సినిమా అనిపిస్తే చాలు చెక్కులు ఇచ్చేస్తున్నాడు. కేరళ నుంచి కథలు తెచ్చుకుంటున్నాడు. రీసెంట్ గా మాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న డ్రైవింగ్ లైసెన్స్ రైట్స్ తీసుకున్నాడు చెర్రీ. 

 

రామ్ చరణ్ ఇంతకుముందు ఓ మళయాళీ మూవీ రైట్స్ తీసుకున్నాడు. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్స్ లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ లూసీఫర్ హక్కులు కొన్నాడు. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. అయితే కొణిదెల ప్రొడక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు చరణ్. 

 

రామ్ చరణ్ మళయాళీ రిమేక్ లపై ఇండస్ట్రీలో ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి.హీరో కమ్ ప్రొడ్యూసర్ గా బిజీగా ఉన్న చరణ్ కొత్త కథలతో ప్రయోగం చేయడం కంటే.. రిమేక్ లే సేఫ్ అనుకుంటున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ లో ఫస్ట్ మూవీ ఖైదీ నెంబర్ 150 కూడా రిమేకే. తమిళ హిట్ కత్తి రిమేక్ గా తెరకెక్కింది ఖైదీ. మరి సినీజనాలు అంటున్నట్టు రిమేకులే సేఫ్ అనుకుంటున్నాడా.. స్ట్రయిట్ స్టోరీస్ వినే టైమ్ లేదా..?

 

మొత్తానికి రామ్ చరణ్ కేరళ కథలపై మనసు పారేసుకున్నాడు. స్టోరీలు వినడం కంటే రిమేక్ లే బెస్ట్ అని భావించిన ఆయన కొత్త రూట్ ను ఎంచుకున్నాడు. మరి రామ్ చరణ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: