టాలీవుడ్‌లో సూప‌ర్‌స్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న హీరో మ‌హేష్‌బాబు. కెరియ‌ర్ స్టార్టింగ్ నుంచి ఎక్కువ‌గా న‌ట‌న మీదే దృష్టి పెట్టినందుకు పెద్ద‌గా బిజినెస్ ల జోలికి పెద్ద‌గా వెళ్ళ‌లేదు. కానీ ప్ర‌స్తుతం ఆయ‌న సొంత బ్యాన‌ర్ నిర్మించి అందులోనే సినిమాలు తీస్తూ విజ‌యాలు సాధిస్తున్నారు. అలా హిట్ కొట్టిన వాటిలోశ్రీ‌మంతుడు, ఇటీవ‌లె విడుద‌లైన స‌రిలేరు చిత్రాలు. అంతేకాక ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌కి అనుగుణంగా థియేట‌ర్ల బిజినెస్‌లోకి అడుగు పెట్టాల‌ని భావిస్తున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ఏషియ‌న్ సునీల్ నారంగ్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. ఆల్రెడీ ఏషియ‌న్ గ్రూప్‌తో క‌లిసి కొండాపూర్‌లో ఓ మ‌ల్టీప్ల‌క్స్‌ని నిర్మించిన విష‌యం తెలిసిందే. మ‌రొక‌టి కూక‌ట్‌ప‌ల్లిలో ఆ త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో నిర్మించాల‌ని చూస్తున్నారు. 

 

అయితే మహేష్ సినిమాలే కాకుండా కొన్ని వాణిజ్య ప్రకటనలకి  కూడా బ్రాండ్ అబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  తాజాగా మహేష్ తన సొంత బిజినెస్‌లు చేస్తూ త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించుకుంటున్నాడు.  తాజాగా మహేష్ క్లోత్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సంగతి కూడా విధితమే. దీనికోసం సూప‌ర్ స్టార్ ”ది హంబుల్ కో” అనే వెబ్ సైట్ కూడా స్టార్ట్ చేసాడు. తాజాగా మహేష్ బాబు  ముందుగా చెప్పిన విధంగానే తన వస్త్ర వ్యాపారానికి సంబంధించిన బ్రాండ్ ”ది హంబుల్ కో” ని అభిమానుల సమక్షంలో హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎలాంటివి విక్రయానికి ఉంచుతారో చూడాలి. 

 

ఇక ఇవికాక ఆయ‌న మహేష్‌బాబు సంపాదన కేవలం సినిమాలు మరియు బ్రాండ్‌ అంబాసిడర్‌గానే 100 కోట్లకు మించి సంపాదిస్తున్నాడు. ఇంకా ఆయనకు లెక్కకు మించి బిజినెస్‌లు ఉన్నాయి. వాటితో కూడా సంపాదన లెక్కకు మించి వస్తుంది. మ‌రి ఇంత ఆదాయం వ‌స్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న పూర్తిగా త‌న ఫ్యామిలీ ఫ్యామిలీనే బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మార్చేసి  భార్య పిల్లలను వినియోగించి మరింత సంపాదించాలని మహేష్‌బాబు భావిస్తున్నాడు అంటూ  ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ఆ మ‌ధ్య‌ విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: