టాలీవుడ్ లో సూపర్ స్టార్ ఇమేజ్ అందుకుని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న మహేష్ తన పాతిక సినిమాల ప్రయాణంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. రాజకుమారుడు నుండి సరిలేరు నీకెవ్వరు వరకు మహేష్ సినిమాలను పరిశీలన చేస్తే ఆయన గట్స్ కు మెచ్చుకోవాల్సిందే. ఎంచుకున్న  కథ ఎలాంటిదైనా సరే ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయ్యాడంటే బ్లైండ్ గా వెళ్లిపోవడమే మహేష్  పని. 

 

ఒక విధంగా చెప్పాలంటే తెలుగు దర్శకులకు ప్రయోగాలు చేయాలనే కసిన పెంచిన హీరో అంటే అది మహేష్ బాబు అనే చెప్పాలి. అంతేకాదు టాలీవుడ్ లో ఉండే హాలీవుడ్ హీరోగా మహేష్ కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఒక స్టార్ గా కాదు కథ ఓకే చేశాక దర్శకుడు ఎలా చెబితే అలా చేసే ఒక ఆర్టిస్ట్ గా తనని తాను మలచుకునే తీరు చాలా గొప్పది. మహేష్ తో సినిమా చేస్తే దర్శకులకు మంచి అనుభూతి ఉంటుంది. 

 

కమర్షియల్ సినిమాలకు కొత్త వన్నె తెచ్చిన హీరో మహేష్. మహేష్ సినిమా హిట్ కొడితే ఆ వసూళ్ల హంగామా ఎలా ఉంటుందో తెలిసిందే. అయితే కొన్ని సార్లు ప్రయోగాలు సక్సెస్ కాకపోతే ఆ ఫెయిల్యూర్ కు కారణం దర్శకుల మీద కాకుండా తన మీద వేసుకునే హీరో ఒక్క మహేష్ బాబే అని చెప్పాలి. ఓవర్సీస్ లో తెలుగు సినిమా మార్కెట్ ఇలా ఉంది అంటే అది మహేష్ బాబు వల్లే.. అక్కడ మొదటి మిలియన్ మార్క్ క్రాస్ చేసిన హీరోగా మహేష్ పేరు మీద రికార్డ్ ఉంది. దర్శకులకు రాసుకున్న పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే మహేష్ తో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలని ఇష్టపడతారు. మరి మహేష్ హవా ఇలానే కొనసాగాలని కోరుకుందాం. ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: