తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇద్దరే ఇద్దరు సూపర్ స్టార్లు నాడు ఘట్టమనేని కృష్ణ సూపర్‌స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటే. నేడు ఆయన తనయుడు తండ్రి సినిమా వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ నేటి సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మహేష్.  ఆరడుగుల అందమైన కటౌట్ మహేష్ తెర మీద చూస్తే చాలు బొమ్మ హిట్టైపోవాల్సిందే.

 

 మహేష్ ను తెరమీద చూసేందుకే తెలుగు ప్రేక్షకులు కిక్కిరిసి మరి థియేటర్లలో కూర్చుంటారు. ఆంధ్ర తెలంగాణ అందగాడు ఆయన మహేష్ పక్కన ఎలాంటి హీరోయిన్ అయినా దిగదుడుపే అని చెప్పాలి. అంటే ఇక్కడ హీరోయిన్ తక్కువ చేసి చెప్పడం కాదు గాని మహేష్ సినిమా రాజకుమారుడు. నటించిన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ప్రీతిజింతా నుంచి సిమ్రాన్‌, సాక్షి శివానంద్, సోనాలి బింద్రే, సమంత, రష్మిక, పూజా హెగ్డే, కైరా అద్వానీ, శృతిహాసన్, కృతి సనన్, అనుష్క, కాజల్ అగర్వాల్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోయిన్లు మహేష్ పక్కన ఆడిపాడారు. ఎంత మంది స్టార్ హీరోయిన్ మహేష్ ను డామినేట్ చేసే హీరోయిన్ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరనే చెప్పాలి. అలాంటి అందం మహేష్ సొంతం.

 

 తెరమీద మహేష్ పక్కన ఎంత గొప్ప హీరోయిన్ ఉన్నా మహేష్ అందాన్ని డామినేట్ చేసే సీన్ ఏ హీరోయిన్ కు ఎప్పుడూ లేదు. గొప్ప గొప్ప హీరోయిన్లను మించిన అందం మన మహేష్ గుడి సొంతం అందుకే ఈ సూపర్‌స్టార్ పక్కన ఎలాంటి హీరోయిన్ కూడా కనిపించే ప్రసక్తే ఉండదన‌డంలో అతిశయోక్తి లేదు. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా స‌రే మ‌హేష్ ప‌క్క‌న న‌టించినా ఫోక‌స్ మొత్తం మ‌హేష్ మీద‌కే వెళుతుంది త‌ప్పించి హీరోయిన్‌ని చూసేవారు చాలా త‌క్కువ మంది ఉంటారు. అలాగే ఆయ‌న సినిమాల్లో హీరోయిన్‌కి ఇంపార్టెన్స్ కాస్త త‌క్కువ‌నే చెప్పాలి. మ‌హేష్ కంటే హైలెట్ అయితే చేసి చూపించ‌రు ద‌ర్శ‌కులు ఏదో సాంగ్ కాస్త సీన్ కోసం ఉన్న‌ట్టు ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: