జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రశ్నించడానికి వచ్చినట్లు పార్టీ పెట్టిన సందర్భంగా తెలపడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో తన పార్టీ ఉంటుందని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆంధ్ర రాజకీయాల్లోనే క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది. ఆంధ్రాలో మూడో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ కి 2019 ఎన్నికల్లో ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం తన పార్టీ తరుపున రావడం జరిగింది. అయితే రాజకీయాల పరంగా ప్రజలను ప్రభావితం చేయడం విషయంలో 2014 కంటే 2019లో చాలా విఫలమయ్యారు. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బిజెపి పార్టీతో పొత్తులు పెట్టుకుని చాలా దూకుడు రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఎన్ని చేసినా గాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడానికి గల కారణం మాటమీద నిలబడే తత్వం లేదని ప్రత్యర్థులు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు.

 

ముఖ్యంగా 2019 ఎన్నికల అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ తట్టాబుట్టా సర్దుకుని మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవడానికి రాజకీయాలు పేక్అప్ చేయడం గ్యారెంటీ అని ప్రత్యర్ధులు విమర్శించారు. ఆ సమయంలో బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ మీడియా ముందు మాట్లాడుతూ….నా చివరి శ్వాస వరకు నా చివరి కట్టె కాలే వరకు సినిమా రంగంలో అడుగుపెట్టాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అభిమానులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఫిదా అయిపోయారు. కోట్ల డబ్బులు వదిలేసి జనం కోసం వచ్చేసాడు అని ఎమోషనల్ అయ్యిపోయి తాము డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశారు.

 

ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు.అయితే గత ఏడాది ఒక్క పవన్ పుట్టిన రోజునే దాదాపు 3 కోట్ల వరకు జనసేన పార్టీ ఖాతాలో వేశారు. అయితే తాజాగా మళ్లీ సినిమారంగంలోకి వెళ్లిపోవడంతో చాలామంది రాజకీయంగా పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీ కార్యకర్తలు బయటకు చెప్పుకోలేక పోయినా గాని విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అంటూ లోలోపల చర్చించుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో మార్చి 14వ తారీకు జనసేన పార్టీ ఆవిర్భావం రోజు నేపథ్యంలో ఈసారి జనసేన పార్టీ కార్యకర్తలు కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్...పెద్దగా జరుపుకొనే పరిస్థితులు లేనట్టు టాక్. ఇక రాజకీయ పరంగా కార్యకర్తలు వదిలేసిన సినిమా పరంగా పవన్ కళ్యాణ్ ని అభిమానులే ఆదుకోవాలి అని ఆయన మంచి కోరేవారు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: