సినిమాల షూటింగ్స్ కు స్టూడియోలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. స్టూడియోలు లేకపోతే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అసాధ్యం. ఎంతటి భారీ సెట్టింగ్స్ అయినా స్టూడియోల్లో నిర్మాణం అవ్వాల్సిందే. అటువంటి ప్రముఖ స్టూడియోలు భారతదేశంలోని అనేక నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అందులో అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్, పద్మాలయా స్టూడియోస్, రామకృష్ణా స్టూడియోస్, సారధి స్టూడియోస్ ప్రముఖమైనవిగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే వీటిలో కొన్ని స్టూడియోలు ఎప్పటినుంచో నిలిచిపోగా ఇప్పుడు వాటి సరసన రామానాయుడు నానక్ రామ్ గూడ స్టూడియో కూడా చేరిపోతోందనే వార్త షాక్ ఇస్తోంది.

 

 

మూవీ మొఘల్ రామానాయుడు హైదరాబాద్ లో నిర్మించిన రామానాయుడు స్టూడియో నిర్మించారు. దీనికి అనుబంధంగానే సురేశ్ బాబు నానక్ రామ్ గూడలో కూడా స్టూడియో ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. లెక్కలేనన్ని సినిమాలు అక్కడ షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిగాయి. సినీ విలేజ్ గా దీనికి పేరు.  ఇప్పుడు ఈ స్టూడియో ఉన్న ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చేస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీకి డెవలెప్ మెంట్ కు ఇస్తున్నారని కూడా వార్తలు రౌండ్ అవుతున్నాయి.

 

 

ఈ వార్తలన్నీ గాసిప్స్ గానే ఉన్నా.. ప్రస్తుతానికి మాత్రం బాగా వైరల్ గా మారింది. ఇందులో నిజమెంతుందో సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి గానీ సురేశ్ బాబు నుంచి గానీ అఫిషియల్ న్యూస్ రావాల్సిందే. ఎంతో ఘన చరిత్ర కలిగిన రామానాయుడు స్టూడియోస్ పై ఈ వార్త సినీ ప్రేమికులకు, తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఓ చేదు వార్తగానే చెప్పాలి. స్మాల్, మీడియం, బిగ్ బడ్జెట్ మూవీస్ ఎన్నో నానక్ రామ్ గూడ స్టూడియోలో షూటింగ్ జరుపుకున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: