టాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. క్రేజ్ మార్కెట్ రెండూ విపరీతంగా పెరిగిపోయాయి. డైరెక్టర్స్ అందరూ విజయ్ కోసం క్యూ లో ఉన్నారు. నిర్మాతలు కూడా అడ్వాన్సులిచ్చి విజయ్ డేట్స్ ని బ్లాక్ చేసుకున్నారు. అదంతా అర్జున్ రెడ్డి సినిమాకి ముందు. కానీ గీత గోవిందం తో మరో ఇమేజ్ ని దక్కించుకున్నాడు. ఎలాంటి సినిమాలైనా చేయగల సత్తా ఉన్న హీరో అంటూ ఇండస్ట్రీలో చెప్పుకున్నారు. కానీ అదంతా నోటా, డియర్ కామ్రేడ్ నాశనం చేశాయి. అయినా ఎక్కడో విజయ్ ఫ్యాన్స్ కి, జనాలకి గట్టి నమ్మకం. విజయ్ నెక్స్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అని. ఆ నమ్మకం మీదే మళ్ళీ దెబ్బ కొట్టాడు విజయ్. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా సరిగ్గా 3 రోజులు తిరిగేసరికి దారుణంగా ఫ్లాప్ అయిపోయింది. 

 

విజయ్ దేవరకొండ మీద, ఈ సినిమాపై క్రిటిక్స్ ఓ రేంజ్ లో ఏసుకున్నారు. ఈ రివ్యూలతో పాటు పబ్లిక్ టాక్ కూడా తోడవ్వడంతో రెండో రోజు నుంచే వరల్డ్ ఫేమస్ లవర్ నేల కరుచుకుంది. ఫస్ట్ వీక్ కంప్లీటయిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయల షేర్ మాత్రమే మహా దారుణం. ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూసుకుంటే ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా కష్టం. వరల్డ్ వైడ్ ఈ సినిమాను 31 కోట్ల రూపాయలకు అమ్మారు. తాజా వసూళ్లతో పోల్చి చేస్తే.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కనీసం ఇంకో 10 రోజులైనా  హౌజ్ ఫుల్స్ అవ్వాలి.

 

కానీ రిలీజైన రెండో రోజు నుంచే విజయ్ దేవరకొండ సినిమాకు ఆక్యుపెన్సీ ఘోరంగా పడిపోయింది. వీకెండ్ అయినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాని కనీసం చూద్దామన్న ఆలోచన లోకి కూడా రాలేకపోయారట. మరీ ఖాళీగా ఉంటే మరోసారి అల వైకుంఠపురములో సినిమా చూడ్డానికి ఇష్టపడ్డారు కానీ, ఈ ఫేమస్ లవర్ ను మాత్రం పట్టించుకోలేదు. అలా విజయ్ దేవరకొండ తన కెరీర్ లో వరుసగా మరో ఫ్లాప్ చూశాడు. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా దారుణంగానే ఫ్లాప్ అయింది. యూఎస్ విజయ్ దేవరకొండ నటించిన ఫ్లాప్ సినిమా నోటా కంటే తక్కువగా వసూళ్లు ఈ సినిమాకు రావడం చూస్తే ఈ సినిమా సీన్ ఏంటో అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: