టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన సినిమాలన్ని వరుసబెట్టి దారుణంగా ఫ్లాపవుతున్నాయి. ఇక తాజాగా వచ్చిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఏ కాంత్రి మాధవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మళ్ళీ మళ్ళీ ఇదిరానిరోజు వంటి బ్యూటి ఫుల్ లవ్ స్టోరీతో సినిమాని తెరకెక్కించి వెమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు క్రాంతి మాధవ్. అందుకే ఆయన దర్శకత్వంలో సినిమా అనగానే, అందులోను హీరో విజయ్ దేవరకొండ అనగానే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కూడా దారుణమైన పరాజయ్యాన్ని మూట గట్టుకోవడమే కాదు విజయ్ ని తన ఫ్యాన్స్ ఫ్రస్టేషన్ లో ఏకిపారేస్తున్నారు.

 

వాస్తవంగా విజయ్ కి యూత్ లో అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో అసాధారణమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ రెండు సినిమాలతో విజయ్ స్టామినా ఇదా అంటూ ఆశ్చర్యపోయోలా అందరికి మైండ్ బ్లాక్ చేశాడు. అంతేకాదు బాలీవుడ్ లోను విపరీతంగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయనప్పటికి తన తో సినిమా చేయాలని, కుదిరితే డేట్ కి వెళ్ళాలని చాలామంది కుర్ర భామలు ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదంతా కేవలం ఒక్క అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చిన క్రేజ్ వల్లే. ఆ సినిమాని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ నటించినప్పటికి ఆ క్యారెక్టర్ లో అందరూ విజయ్ నే ఊహించుకున్నారు.

 

అయితే గీత గోవిందం సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్ని వరుసగా ఫ్లాపవుతున్నాయి. వాస్తవగా టాక్సీవాలా ముందే రిలీజ్ కావాలి. కాని ఆ సినిమా గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత రిలీజైంది కాబట్టి మంచి వసూళ్ళని రాబట్టింది. కానీ, డియర్ కామ్రేడ్ ఘోరంగా విజయ్ మార్కెట్ ని, పాపులారిటీని దెబ్బతీసింది. నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలతో విజయ్ మీద ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు.అది వరల్డ్ ఫేమస్ లవర్ తో తగ్గిస్తాడనుకుంటే సీన్ రివర్స్ అయి బొమ్మ తిరగబడింది. దాంతో విజయ్ ఫ్యాన్స్ కాలిపోతోంది. అయితే ఇలా వరుసబెట్టి సినిమాలెందుకు ఫ్లాపవుతున్నాయంటే ఇంకా విజయ్ అర్జున్ రెడ్డి తరహా స్క్రిప్ట్ లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడట. 

క్యారెక్టర్ లో కొత్తదనం చూడటం లేదట. తనకి బాగా అలవాటైన యాటిట్యూడ్ ఉన్న స్క్రిప్ట్ లకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటంతోనే విజయ్ సినిమాలు ఫ్లాపవుతున్నాయని అర్థమైంది. వాస్తవంగా గీత గోవిందం లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీస్ వచ్చినా వాటిని పక్కన పెట్టడంతోనే విజయ్ జెరీర్ ఇలా అయిందని క్లారిటీ వచ్చిందట. ఇది తెలీక పాపం జనాలు ఎందుకు విజయ్ సినిమాలు ఫ్లాపవుతున్నాయని జుట్టు పీక్కున్నారు ఇన్నాళ్ళు. అసలు మ్యాటర్ మాత్రం అదీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: