నార్త్ సౌత్ లో అతి పెద్ద రియాలిటి షో బిగ్ బాస్. హిందీ తో పాటు, తెలుగు తమిళంలో సీజన్స్ వారీగా ప్రసారమవుతున్న ఈ బిగ్ రియాలిటీ షోకి ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు. భయంకరమైన కాంట్రవస్రీతో సాగుతున్న ఈ షో ని స్టార్ యాజమాన్యం నిర్వహిస్తోంది. ఇక బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 13లో ఫిక్సింగ్ జరిగిందా .. అంటూ అనుమానాలు వ్యూక్తమవుతున్నాయి. ఈ షోలో ప్రముఖ బుల్లితెర నటుడు సిద్దార్థ్ శుక్లా ట్రోఫీ గెలిచారు. రన్నరప్‌గా ఆసిమ్ రియాజ్ గెలిచాడు. అయితే షోలో సిద్దార్థ్ కంటే ఆసిమ్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయట. కానీ ఫిక్సింగ్ చేసి సిద్దార్థ్‌ను గెలిపించారని సంచలనమైన కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు బిగ్‌బాస్ షోని ప్రసారం చేసిన కలర్స్ టీవీ‌లో పనిచేసే ఉద్యోగిని కూడా ఫిక్సింగ్ జరిగిందని షాకింగ్ విషయాలు బయటపెట్టడంతో పెద్ద రచ్చ జరుగుతోంది.

 

ఫెరీహా అనే ఉద్యోగిని బిగ్‌బాస్ షోలో ఫిక్సింగ్ జరిగిందని పేర్కొంటూ వివాదాస్పదంగా ట్వీట్ పెట్టింది. ‘‘నేను కలర్స్ టీవీలో ఉద్యోగం మానేసాను. కలర్స్ క్రియేటివ్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఫీలవుతున్నాను. కానీ బిగ్‌బాస్ లాంటి ఫిక్స్‌డ్ షోలో నేను భాగం అయ్యి నా మనసాక్షిని చంపుకోలేను. తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ ఛానెల్ సిద్దార్థ్ శుక్లానే విన్నర్‌ని చేసింది. సారీ.. ఇలాంటి ఛానెల్‌తో కలిసి నేను పనిచేయలేను’ అని ట్వీట్ చేసింది. అయితే దీనిపై కలర్స్ టీవీ సంస్థ వెంటనే స్పందించింది.

 

‘మేం ఓ విషయం క్లారిటీగా చెప్పాలనుంకుంటున్నాం. ఫెరీహా అనే యువతి మా ఛానెల్‌లో పనిచేయలేదు. అసలు ఆ పేరుతో ఏ అమ్మాయీ లేదు. తను మా సంస్థపై చేస్తున్న ఆరోపణల్లో అసలు నిజం లేదు. ఇలాంటి బుర్ర లేని వాళ్లు చెప్పే మాటలు ఎవరు అస్సలు పట్టించుకోకండి’ అని క్లారిటీ ఇచ్చారు. సల్మాన్ ఖాన్.. సిద్దార్థ్ శుక్లాను విన్నర్ అని ప్రకటించినప్పుడే ఫిక్సింగ్ జరిగిందని చాలా మంది ట్వీట్లు చేసారు. సిద్దార్థ్‌ని ఎలా గెలిపిస్తారు అని సెలబ్రిటీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. మరి ఇందులో ఎంత వాస్తవముందో తెలీదు గాని రచ్చ మాత్రం మామూలుగా జరగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: