టాలీవుడ్ దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్, మొదటగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన డాడీ సినిమాలో ఒక చిన్న డాన్స్ బిట్ లో నటించి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాడు. ఆపై గంగోత్రి సినిమాతో టాలీవుడ్ నటుడిగా పరిచయం అయిన అల్లు అర్జున్, రెండవ సినిమా ఆర్య తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత బన్నీ అనే సినిమాలో నటించి, తన ముద్దుపేరునే ఆ సినిమాకు టైటిల్ గా పెట్టుకుని మంచి విజయం అందుకున్నాడు. ఇక అక్కడి నుండి బన్నీ మెల్లగా ఒక్కొక్క అవకాశం అందుకుంటూ ముందుకు సాగాడు. 

 

అంతేకాక తన సినిమా కథల ఎంపికలో ఎంతో వైవిద్యం చూపించే బన్నీ, తన ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు ఎంచుకుంటూ ఉంటారు. ఆ విధంగా బన్నీ నటించిన రేసు గుర్రం సినిమా 2014లో రిలీజ్ అయి అప్పట్లో అతి పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. నిజానికి అంతకముందు ఆర్య, దేశముదురు సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టినప్పటికీ, బన్నీ యొక్క స్టామినా, కలెక్షన్ పొటెన్షియాలిటీని ప్రూవ్ చేసిన సినిమా మాత్రం రేసు గుర్రం అనే చెప్పాలి. ఇక ఆ సినిమా చూడడానికి క్లాస్, మాస్, చిన్న, పెద్ద అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్యూ కట్టారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. 

 

తన సోదరుడితో ఎప్పుడూ గొడవపడే హీరో, ఒక్కసారిగా విలన్ దృష్టి తన సోదరుడిపై పడడంతో తన తెలివితేటలతో విలన్ ని మట్టుబెట్టి సోదరుడిని, కుటుంబాన్ని ఎలా జయించాడు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆ సినిమా ద్వారా బన్నీ బాక్సాఫీస్ తో ఒక బంతాట ఆడాడనే చెప్పాలి. దాదాపుగా నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి రెండొంతులకు పైగా రాబట్టిన సినిమా, అప్పట్లో బన్నీ మార్కెట్ రేంజ్ ని కూడా అమాంతం పెంచేసింది అనే చెప్పాలి. ఆ విధంగా రేసు గుర్రం సినిమా బన్నీ కెరీర్ ని ఒక గొప్ప మలుపు తిప్పిన సినిమాగా చెప్పవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: