టాలీవుడ్ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందుగా బాలనటుడిగా బలరామాయణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని, బాలనటుడిగా ఎన్టీఆర్ కు మంచి పేరు తెచ్చింది. ఇక ఆ తరువాత మెల్లగా తన చదువు, కెరీర్ పై దృష్టి పెట్టిన ఎన్టీఆర్, ఆ పై నాట్యం, డాన్స్, యాక్టింగ్ వంటి వాటిలో మంచి శిక్షణ తీసుకుని నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా బాగానే ఆడింది. 

 

ఇక ఆ తరువాత ఎస్ ఎస్ రాజమౌళి తొలిసారిగా దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో నటించిన ఎన్టీఆర్, ఆ సినిమాతో మంచి మాస్ హిట్ ని అందుకున్నారు. ఇక ఆ తరువాత అయన నటించిన నాలుగవ సినిమా ఆది సూపర్ హిట్ కొట్టి ఎన్టీఆర్ కు మంచి మాస్ విజయాన్ని అందించింది. ఆపై ఎన్టీఆర్ కెరీర్ ఏడవ సినిమాగా రెండవ సారి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అత్యధిక కేంద్రాల్లో 175 రోజూలు ఆడిన సినిమాగా ఆ సినిమా అప్పట్లో గొప్ప రికార్డు సొంతం చేసుకోవడంతో పాటు ఇప్పటికీ కూడా ఆ రికార్డ్ ని మరెవరూ టచ్ చేయలేని రేంజ్ లో ఉంది. 

 

అంతేకాక పలు సెంటర్స్ లో ఆ సినిమా అద్భుతంగా కలెక్షన్ ని రాబట్టి ఎన్టీఆర్ బరిలోకి దిగాక బాక్సాఫీస్ సైతం భయంతో వణికిపోయేలా చేసిందిఅనే చెప్పాలి. నమ్మిన బంటు సింహాద్రిగా ఎన్టీఆర్ అద్భుత నటనతో పాటు సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కు అప్పట్లో ఆ సినిమాలో ఎంతో ఎలివేట్ అయ్యాయి. భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించిన ఆ సినిమాకు కీరవాణి అందించిన సాంగ్స్ అతి పెద్ద సెన్సేషన్ ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలోని నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి సాంగ్ ని ఇప్పటికీ మన ప్రేక్షకులు మరిచిపోలేరు.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: