టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ మూవీ తో మంచి సక్సెస్ అందుకున్న పవన్, ఆ తరువాత నటించిన గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ సినిమాలతో కూడా మంచి హిట్స్ అందుకుని యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించారు. ఇక ఆ తర్వాత ఆయన నటించిన బద్రి, ఖుషి సినిమాలు అతి పెద్ద విజయాలు అందుకుకుని, పవన్ కి విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టడం జరిగింది. నిజానికి ఖుషి సినిమా అప్పటి యువత మనసులలోకి ఎలా దూసుకెళ్ళిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

 

అయితే ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని ఆయన నటించిన జానీ సినిమా అప్పట్లో పెద్ద పరాజయాన్ని అందుకుంది. ఇక దాని తరువాత వచ్చిన సినిమాలు ఏవి కూడా చాలావరకు పవన్ కు సక్సెస్ ని అందించలేకపోయాయి. అయితే అదే సమయంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా పవన్ కు సక్సెస్ ని అందించినా, ఆయన ఫ్యాన్స్ కు మాత్రం మరింత కిక్ ఇచ్చే సక్సెస్ కావాలనిపించింది. ఇక తరువాత వచ్చిన పవన్ తదుపరి సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే సరిగ్గా అదే సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కిన హిందీ మూవీ దబాంగ్ రీమేక్ అయిన గబ్బర్ సింగ్ సినిమా అప్పట్లో అతి పెద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. 

 

ఒక్కసారిగా పదేళ్ల నుండి ఎంతో ఆకలిగా ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్  ఆకలిని హరీష్ ఆ ఒక్క సినిమాతో తీర్చేసారు. పవన్ పవర్ తో పెట్టుకుంటే ఏ రికార్డు అయినా పరారే అనడానికి గబ్బర్ సింగ్ సినిమా అప్పట్లో క్రియేట్ చేసిన రికార్డులే నిదర్శనం. ఇక ఇప్పటికీ కూడా అక్కడక్కడా కొన్ని ఏరియాల్లో ఆ సినిమా రికార్డ్స్ ఇంకా పదిలంగా ఉన్నాయంటే అర్ధం చేసుకోవచ్చు, ఆ సినిమా పవర్ ఏంటో. మరి ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్, మరొక్కసారి ఆ స్థాయి విజయాన్ని ఫ్యాన్స్ కు ఎప్పుడు అందిస్తారో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: