సినిమా నిర్మాణ రంగంలో ఉన్న కొందరు నిర్మాతలు లాభనష్టాలతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారు. అలాంటి వారిలో క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్. రామారావు కూడా ఉన్నారు. ఈయన పేరు చెబితే చిరంజీవితో ఆయన తీసిన సినిమాలు, వాటి విజయాలు, వారిద్దరి అనుబంధమే కళ్ల ముందు మెదులుతుంది. చిరంజీవి పేరు ముందు మెగాస్టార్అని మొదట వేసింది ఈయన తీసిన మరణమృదంగం సినిమాతోనే. సినిమా మీద ప్రేమతో పరిస్థితులు మారినా అడపాదడపా సినిమాలు తీస్తున్నారు. అటువంటి కేఎస్ రామారావును కోలుకోలేని దెబ్బ తీసింది వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా.

 

 

మొదటి షో నుంచే ఫ్లాప్ తెచ్చుకుని మూడు రోజుల్లోనే తేలిపోయింది ఈ సినిమా. ప్రేక్షకుల నుంచే కాదు.. యూత్ నుంచి కూడా ఈ సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోలేక పోయింది. సినిమా రిలీజైన రోజు సాయంత్రానికే సక్సెస్ మీట్లు పెడుతున్న ఈ రోజుల్లో.. ఈ సినిమా విడుదలయ్యాక ఇప్పటివరకే హీరో, హీరోయిన్లు, నిర్మాత, దర్శకులు ఎవరూ అడ్రెస్ లేరు. ఫలితం తేలిపోవటంతో నిర్మాత కూడా సక్సెస్ మీట్ ను అడ్రస్ చేయలేదు. ఈ సినిమా నష్టాలతో రామారావుకు భారీ నష్టాలు వచ్చాయంటున్నారు. ఇప్పటికే కొంత లాస్ ను సెటిల్ చేశారని ఫిలింనగర్ సమాచారం. ఇందుకు కొంత ప్రాపర్టీని సేల్ పెట్టారని కూడా అంటున్నారు.

 

 

ఎన్టీఆర్ తో తీసిన దమ్ము, సాయిధరమ్ తో చేసిన తేజ్.. ఐలవ్ యూ.. సినిమాలతో ఫ్లాప్ లు అందుకున్న ఈ నిర్మాతకు వరల్డ్ ఫేమస్ లవర్ మరింత కుంగదీసిందని అంటున్నారు. విజయ్ దేవరకొండ మితిమీరిన జోక్యంతో దర్శకుడు క్రాంతిమాధవ్ కు స్వేఛ్చ లేకుండా చేశాడని అంటున్నారు. ఔట్ పుట్ లో తేడాకు ఇదే కారణమంటున్నారు. అభిరుచి కలిగిన ఇటువంటి నిర్మాతలకు ఇలా నష్టం రావడం బాధాకరమైన విషయం.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: