డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని నటించిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. గత ఏడాది జూలై 18 వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అయింది. దాదాపు పూరి జగన్నాథ్ కెరియర్ ఆల్మోస్ట్ ఆల్ అంత క్లోజ్ అన్న తరుణంలో ఇల్లు మరియు ఆఫీసులో అంతా అమ్ముకొని కథని నమ్మి తానే నిర్మాతగా మరియు డైరెక్టర్ గా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేయటం జరిగింది. సినిమా అదిరిపోయే రేంజ్ లో హిట్ అయింది.

 

మాస్ సెంటర్లలో ఈ సినిమా కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. హీరో రామ్ కెరియర్ కూడా ఫుల్లు డార్క్ లో ఉన్న ఈ సమయంలో ఈ సినిమా చేసి అదిరిపోయే రేంజ్ లో విజయాన్ని సాధించారు. పూరి జగన్నాథ్ మరియు రామ్ కెరీర్లోనే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా అత్యధిక వసూలు రికార్డులు మరియు కలెక్షన్లు సాధించిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది.

 

సినిమా ఇచ్చిన విజయంతో రామ్ మరియు పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో స్టాండర్డ్ అయిపోయారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవడమే ఆలస్యం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు పూరి జగన్నాథ్ ఇస్ బ్యాక్ అంటూ..సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేశారు. దాదాపు సినిమాకు పెట్టిన పెట్టుబడుల కంటే మూడు రెట్లు లాభాలు ఆదాయం వచ్చింది.

 

దీంతో పూరిజగన్నాథ్ ఫుల్ హ్యాపీ అయ్యాడు. అంత సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా తాజాగా 7 నెలల తర్వాత ఇప్పుడు బాలీవుడ్ లో డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.  24 గంటల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ సినిమాకు ఏకంగా 11 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగులో తెరపై సందడి చేసిన ఇస్మార్ట్ శంకర్, హిందీలో యూట్యూబ్ లో సంచలనాలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: