సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమాలోనే కాదు నిజ జీవితంలోను సూపర్ స్టార్ ఏ. మారే హీరో చెయ్యలేని పనులు అన్ని మహేష్ బాబు చేస్తూ సంచలనం సృష్టిస్తాడు.. అలాంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమాలో చేసిన పనిని నిజంగా చేసి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. అంతటి గొప్ప పని ఏంటి అనుకుంటున్నారా? 

 

అదేనండి.. మహేష్ బాబు 2015 లో ఓ అద్భుతమైన సినిమా తీశాడు. ఆ సినిమా పేరు శ్రీమంతుడు. ఆ సినిమాలో తన తండ్రి సొంత ఊరును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాడు. ఆ గ్రామంను ఎంతో అభివృద్ధి చేస్తాడు. అలానే.. సినిమాలో ఎలా అయితే చేశాడో.. అచ్చం అలానే నిజ జీవితంలో కూడా తన సొంత గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు మహేష్ బాబు. 

 

ఆ గ్రామం ఏంటి అనుకుంటున్నారా? ఆ గ్రామం గుంటూరు జిల్లాలో ఉంది. దాని పేరు బుర్రిపాలెం. ఆ గ్రామంను ఎంతో అభివృద్ధి చేశాడు మహేష్ బాబు. సమయం దొరికినప్పుడల్లా గ్రామాన్ని తీర్చి దిద్దుతూ అద్భుతంగా మార్చడు. తన సొంత ఊరు అయినా బుర్రిపాలెంలో వైద్య ఆరోగ్య సర్వేలు.. అప్పుడప్పుడు పర్యటించడం.. ప్రజలకు కావాల్సినవి కనుక్కోవడం అన్ని చేసి ప్రజలకు దగ్గర అయ్యాడు మహేష్ బాబు. 

 

ఇక బుర్రెపాలం గ్రామాన్ని అన్ని సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దిన మహేష్ బాబు.. తెలంగాణలోనూ కొత్తూరు మండలంలోని సిద్ధాపురం గ్రామాన్ని మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేసారు. భర్త ఆశయాలకు దగ్గరగా భార్య నమ్రతా శిరోద్కర్ దగ్గరుండి మరీ గ్రామాన్ని అభివృద్ధి చేయించారు. 

 

ఇలా సినిమాలోనే కాదు.. నిజజీవితంలో కూడా తన మంచి మనసును ప్రజలకు చూపించాడు మహేష్ బాబు. ఇంకా సొంత గ్రామాల అభివృద్ధి కోసం మహేష్ భార్య నమ్రత రాజకీయనాయకులు కలిసి అభివృద్ధి చెయ్యడానికి సహకరించాలని కోరడం మనం తెలిసిన విషయమే.. ఇలా రాజకీయాలకు దూరంగా ఉంటూనే మహేష్ గ్రామాలను అభివృద్ధి చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: