మహేష్ బాబు అమ్మయిల కలల రాకుమారుడు.. ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసి ప్రజల గుండెల్లో నిలిచినా హీరో.. ఒక్క సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా తన హీరోయిజాన్ని చూపించిన అద్భుత నటుడు మహేష్ బాబు. అలాంటి సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ప్రస్థానం ఎలా ఉందొ ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

సూపర్ స్టార్ మహేష్ బాబు చైల్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరియర్ ను ప్రారంభించారు.1979 లో నీడ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయామైన మహేష్ బాబు రాఘవేంద్ర రావు దర్శకత్వం లో 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 

 

ఆ తర్వాత యువ రాజు సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. ఇక మహేష్ బాబుని అసలుసిసలైన హీరోని చేసింది మురారి సినిమా చెప్పాలి. ఈ మురారి చిత్రంతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు మహేష్ బాబు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కడు సినిమా మహేష్ కెరియర్ నే మలుపు తిప్పింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్. 

 

ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా ఏలాంటి సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ సినిమా ఇప్పుడు చుసిన మరోసారి చూడాలి అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది ఆ సినిమా. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు చిత్రం అయితే.. బుల్లితెరపై ఈరోజు వేసిన టాప్ రేటింగ్ వస్తుంది. అంత అద్భుతమైన చిత్రం అది. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు సినిమా ఆల్ టైం రికార్డు సొంతం చేసుకుంది. 

 

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఒక అద్భుతం అనే చెప్పాలి. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు సినిమా. కొరటాలతో రెండొవ సినిమాగా వచ్చిన 'భరత్ అనే నేను' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా ఇప్పుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా ఎంతటి సూపర్ హిట్స్ ఓ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలు అన్ని కూడా మహేష్ బాబు సినీ కెరియర్ లో అద్భుతమైన సినిమాలు.. మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే సినిమాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: