మొదటి సినిమాతోనే హిట్టు కొట్టిన డైరక్టర్.. ఫామ్ లో ఉన్న హీరోయిన్.. తనకు సూపర్ హిట్ ఇచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్ తో వస్తున్న యువ హీరో.. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భీష్మ. నితిన్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఛలో ఫేం వెంకీ కుడుముల డైరెక్ట్ చేశారు. ఈ నెల 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తే సినిమా పక్కా హిట్ అనే పాజిటివ్ బజ్ వచ్చేసింది. ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఈ మూవీలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా డైరెక్టర్ కు బాగా పట్టున్న కామెడీ మీద బాగా దృష్టి పెట్టాడు.

 

రెండు నిమిషాల ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచాడు వెంకీ కుడుముల. ప్రస్తుతం వరుస స్టార్ సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్న రష్మిక ఈ భీష్మతో కూడా మరోసారి తన మ్యాజిక్ చూపించనుంది. ఈ సినిమా బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరిగిందని తెలుస్తుంది. పాతిక కోట్లతో సినిమాను పూర్తి చేయగా రిలీజ్ ముందే 10 కోట్ల ప్రాఫిట్ తెచ్చిందని తెలుస్తుంది. థియేట్రికల్ రైట్స్ మొత్తం 20 కోట్ల వరకు జరిగిందట. ఆంధ్రా 8 కోట్లు, నైజాం 4.5 కోట్లు, సీడెడ్ 2 కోట్లు బిజినెస్ చేయగా ఓవర్సీస్ మిగిలిన ఏరియాల్లో 5.5 కోట్ల దాకా బిజినెస్ చేసిందట.   

 

థియేట్రికల్ బిజినెస్ 25 కోట్ల దాకా రాగా డిజిటల్, శాటిలైట్ రైట్స్ మరో 10 కోట్లు తెచ్చాయట. ఫైనల్ గా నితిన్ భీష్మ రిలీజ్ ముందే 35 కోట్ల బిజినెస్ చేసింది. అంటే బడ్జెట్ కన్నా 10 కోట్ల ప్రాఫిట్ లో ఉంది. సినిమా హిట్ టాక్ వస్తే థియేట్రికల్ రైట్స్ అమ్మిన పాతిక కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమి కాదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీసినిమా నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: