నానక్ రామ్ గూడ ప్రాంతంలోని రామానాయుడు స్టూడియో మూసివేసి దానిని గేటెడ్ కమ్యూనిటీ గా మార్చే నిర్ణయం నిర్మాత సురేశ్ బాబు తీసుకోవడంతో దగ్గుబాటి ఫ్యామిలీకి 400 కోట్ల ఆదాయం వస్తుంది అంటూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఈ 400 కోట్లతో సురేశ్ బాబు వైజాగ్ లోని తమ రామానాయుడు స్టూడియోను అత్యాధునికంగా తయారు చేయడమే కాకుండా అక్కడ రానా తో నిర్మించబోయే ‘హిరణ్యకశిప’ మూవీ కోసం కోట్ల విలువ చేసే ఒక భారీ సెట్ ను వేయబోతున్నట్లు సమాచారం.


ఈ వార్తల ప్రకారం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి విశాఖపట్నంలో తీయబోయే మొదటి అత్యంత భారీ మూవీ ‘హిరణ్యకశిప’ కాబోతోంది. ఇప్పటికే గుణ శేఖర్ ఈ సినిమాకు సంబంధించి కథ పై మాత్రమే కాకుండా కేవలం గ్రాఫిక్స్ కోసం కొన్ని వేల స్కెచ్ లు వేయించాడు. 


రానా పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఇప్పుడు తిరిగి రావడంతో ఈ మూవీ షూటింగ్ ను ఈ ఏడాది మొదలుపెట్టి ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా అనేక భాషలలో ఒకేసారి విడుదల చేయడానికి భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి విశాఖపట్నం వెళ్ళడం వల్ల భారీ పరిశ్రమలు వచ్చినా రాకపోయినా వైజాగ్ లో ఉండే అనేక వందలమంది చిన్న కళాకారులకు టాలీవుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్ మారడం వల్ల అనేక అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది. 


వందల కోట్ల విలువచేసే స్థలాన్ని కలిగి ఉన్నా హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో వల్ల కేవలం సంవత్సరానికి రెండు కోట్లు మాత్రమే ఆదాయం వస్తున్న పరిస్థితులలో సురేశ్ బాబు హైదరాబాద్ లోని తన స్టూడియోను ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీగా మార్చే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్టూడియో మూసివేతతో వచ్చే ఆదాయంలో కొంత భాగం ‘హిరణ్యకశిప’ పెట్టుబడిగా మారుతున్న నేపధ్యంలో రానా పై సురేశ్ బాబు 400 కోట్ల జూదం ఆడుతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: