రామ్ పోతినేని.. వాళ్ళ అక్క ఇంత అందంగా ఉంటుంది అని ఎవరు ఉహించి ఉండరు.. ఎందుకంటే.. రామ్ కు అక్క ఉంది అనేదే చాలామంది ప్రజలకు తెలియదు కాబట్టి. ఎందుకంటే మన ఈ క్యూట్ స్టార్ రామ్.. ఎప్పుడు సినిమాలలో కనిపిస్తాడు కానీ.. ఆఖరికి గాసిప్స్ లో కూడా కనిపించడు. రామ్ పోతినేని ఎన్ని సినిమాలు తీసిన లిమిట్స్ లోనే ఉంటాడు. 

 

బాల నటుడుగా అలరించి.. దేవదాసు చిత్రంతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనా రామ్.. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు.. ఇంకా స్టార్ హీరో అవ్వకపోయినప్పటికీ.. ఎప్పటికైనా స్టార్ హీరో అవుతాడు అనే రేంజ్ లో సినిమాలు తీస్తున్నాడు. 

 

ఇక పోతే ఇన్నాళ్లు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా హీరో రామ్.. ఇప్పుడు అన్ని మాస్ చిత్రాలు తీసి ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాడు.. నిజానికి హీరో రామ్ కు ఫస్ట్ నుండి కూడా మాస్ చిత్రాల్లోనే నటించాలి అని ఉండేది. అయితే దేవదాసు లవ్ స్టోరీ తీశాక.. జగడం అని మాస్ చిత్రం తీసి బొక్కబోర్లా పడ్డాడు. 

 

దీంతో మళ్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాలు తీసి ఇప్పుడిప్పుడే మాస్ డైరెక్టర్స్ పూరి జగన్నాధ్ లాంటి వాళ్ళతో 'ఇస్మార్ట్ శంకర్' వంటి చిత్రాలు తీస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరుని సొంతం చేసుకుంటున్నాడు హీరో రామ్. ఈ నేపథ్యంలోనే హీరో రామ్ అక్క ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

ఆ ఫోటోలు చూస్తే.. రామ్ అక్క ఇంత అందంగా ఉందా ? అని అనకుండా ఉండరు.. అంత అందంగా ఉంది రామ్ అక్క. ఇంకా ఆమె పేరు మధు స్మిత పోతినేని.. గూగుల్ అంత చేసి వెతికిన మీకు ఆమె ఒక్క ఫోటో కంటే ఎక్కువ కనిపించదు. కానీ ఇప్పటి హీరోయిన్స్ కంటే ఎంతో అందంగా ఉంది ఆమె. అయితే ఆమె ఒక ఆర్టిస్ట్. ఆమెకు శర్వానంద్ అన్న కళ్యాణ్ తో పెళ్లి కూడా అయ్యింది. ఇప్పుడు వారు ఇద్దరు అమెరికాలో సెటిల్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హాల్ చల్ చెయ్యగా నెటిజన్లు అంత 'అనుష్క కంటే అందంగా ఉంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: