తెలుగు ఇండస్ట్రీలో ఈగ చిత్రంతో సెన్సేషన్ సృష్టించిన రాజమౌళి టెక్నాలజీ రుచి ఏంటో చూపించాడు.  గ్రాఫిక్ మాయాజాలంతో ఒక చిన్న ఈగను హీరోగా చిత్రీకరించారు.  ఆ తర్వాత బాహుబలి, బాహుబలి 2 లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా ఏంటో చూపించాడు.  బాహుబలి చిత్రం జాతీయ స్థాయిలో ట్రెండ్ సృష్టించింది.   తెలుగు చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌కి తీసుకెళ్లి, మన చిత్రం స్థాయిని పెంచడమే కాక తెలుగు చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని, గౌరవాన్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ లాంటి మరో ప్రతిష్టాత్మక చిత్రం తీసే పనిలో ఉన్నారు.  ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి టాలీవుడ్ దిగ్గజాలు కలిసి నటిస్తున్నారు. 

 

ఈ చిత్రం షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. అంత వరకు ఓకే కానీ ఈ మద్య ఈ చిత్రానికి సంబంధించి వరుస లీకేజ్ లతో చిత్ర యూనిట్ తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంటుంది.   ఆర్ ఆర్ ఆర్  స్వాతంత్ర్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరంభీమ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు సీత పాత్ర‌లో ఆలియా భ‌ట్ న‌టిస్తుంది. కాగా.. ‘ఆర్ఆర్ఆర్‌’లో చ‌ర‌ణ్‌, ఆలియా లుక్స్ ఇవేనంటూ సోష‌ల్ మీడియాలో రెండు ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

 

అయితే గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ మేడ్ పోస్టర్స్ తో తెగ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ ఈ తరహా పోస్టర్స్ చేశారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.  బ్రిటీష్ సైనికాధికారి పాత్ర‌లో చ‌ర‌ణ్‌, పాత‌కాలం చీర‌క‌ట్టులో ఆలియాభ‌ట్ క‌న‌ప‌డుతున్నారు. ఇవి నిజంగా చిత్రంలో ఫోటోలా కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాలంటే మూవీ యూనిట్ ఈ లీకేజ్డ్ పిక్స్ గురించి క్లారిటీ ఇవ్వాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: