విజయ్ దేవరకొండ పెళ్ళి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఆ ఒక్క సినిమా అతడిని ఎక్కడికో తీసుకువెళ్ళింది. అర్జున్ రెడ్డి తర్వాత గీత గోవిందం కూడా బ్లాక్ బస్టర్ అవడంతో విజయ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ మూడు సినిమాలతో బాలీవుడ్ లోనూ మనోడికి మంచి పేరు వచ్చింది. అయితే తనకి వచ్చిన ఈ స్టార్ స్టేటస్ ని తానే చెడగొట్టుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది.

 

 


విజయ్ సినిమాలు హిట్ అవుతున్న కొద్దీ అతని ప్రవర్తనలో మార్పు వస్తున్నట్టు కనబడుతుందని అంటున్నారు. సినిమా విషయంలో హీరో కొన్ని ఇన్ పుట్స్ ఇవ్వడం అనేది మామూలే. అయితే అది కేవలం ఒక పరిధి వరకు ఉంటే బాగుంటుంది. అంతే కానీ అన్నీ తనకే తెలుసని, అన్నీ తాను చేయగలనన్న నమ్మకంతో ఉండి అవతలి వారి పనిలోకి వచ్చి కెలికితే అస్సలు బాగుండదు.

 

 

విజయ్ దేవరకొండ గత కొన్ని రోజులుగా అదే చేస్తున్నాడట. డియర్ కామ్రేడ్ విషయంలో కొత్త దర్శకుడు కావడంతో అన్నీ తనకి నచ్చిన విధంగా తీసుకున్నాడని అంటున్నారు. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మార్చేసి తనకి నచ్చినట్టు తీసుకున్నాడట. అందుకే గత ఏడాదిలోనే రావాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరి వరకు వచ్చింది. ఆ సినిమా ఎంతలా డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వరల్డ్ పేమస్ లవర్ సినిమాలో కూడా అలాగే జరిగిందట. 

 

 

 

అందుకే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో ఫైటింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూరి అనుభవజ్ఞుడు కాబట్టి విజయ్ అంతలా సినిమాలో కెలికే అవకాశం ఉండకపోవచ్చు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: