హీరోలు స్టార్ రేసులో ముందుకెళ్లాలంటే అపోజిట్ హీరోలతో పోటీ పడాలి. కానీ టైగర్ ష్రాఫ్ మాత్రం హీరోయిన్లతో పోటీపడుతున్నాడు. గ్లామర్ డోస్ తో అభిమానులను సంపాదించుకునే బ్యూటీస్ కు ఎదురు వెళ్తున్నాడు టైగర్. మరి హీరోలతో పోటీపడకుండా.. టైగర్ హీరోయిన్లతో  ఎందుకు పోటీపడుతున్నాడు. 

 

టైగర్ ష్రాఫ్ బాలీవుడ్  లో వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్సర్. యాక్షన్ స్టంట్స్ లోనూ అదరగొడతాడు. రాంబో తరహా లుక్ తో బరిలో దిగుతుంటాడు. షర్ట్ లెస్ పాటలు, ఫైట్లతో మజిల్ బాడీని ప్రదర్శిస్తుంటాడు. ఇవి టైగర్ కు చాలా ఇష్టమైన పనులేమోగానీ.. నెటిజన్లు  మాత్రం వీటిపై బోలెడన్ని సెటైర్లు వేస్తున్నారు. టైగర్ ఎక్స్ పోజింగ్ లో హీరోయిన్లతో పోటీపడుతున్నాడని కామెంట్ చేస్తున్నారు.


టైగర్ ష్రాఫ్ ఫిట్ నెస్ కు చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు ప్రతీరోజు వర్కవుట్లు చేస్తాడు. గంటల కొద్దీ జిమ్ లో గడుపుతుంటాడు. ఇంక అంత కష్టపడి బిల్డ్ చేసుకున్న బాడీని అంతే ఇష్టంగా వెండితెరకెక్కిస్తాడు. పక్కన ఎంత గ్లామరస్ హీరోయిన్ ఉన్నా.. ఆమె డ్రెస్ ఎలర్జీతో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేస్తున్నా.. టైగర్ కూడా సిక్స్ ప్యాక్ ప్రదర్శిస్తుంటాడు. 

 

యాక్షన్ మూవీస్ అంటే పడిపోయే టైగర్ ష్రాఫ్, సినిమాల్లో ఫైట్ సీన్స్ అంటే చాలు షర్ట్ విప్పుతాడు. మజిల్డ్ బాడీతో విలన్స్ ని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. డెబ్యూ మూవీ నుంచి మొదలుపెడితే రాబోయే బాఘీ 3 వరకు అన్నింటా ఇలాగే షర్ట్ లెస్ గా కనిపిస్తున్నాడు. దీంతో నెటిజన్లు టైగర్.. హీరోయిన్లతో పోటీగా ఎక్స్ పోజింగ్ చేస్తున్నాడని ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి టైగర్ ష్రాఫ్  ఫిట్ నెస్.. సిక్స్ ప్యాక్ బాడీతో స్పెషల్ అట్రాక్షన్  గా నిలుస్తున్నాడు. సినిమాల్లో విలన్లకు సింహ స్వప్నంలా కనిపిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తున్నాడు. టైగర్ ష్రాఫ్ సినిమాలంటే యూత్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: