తన దర్శకత్వంతో తెలుగు సినీ పరిశ్రమనే ప్రపంచానికి తెలియజేసిన ఈ దర్శకుడు. అభిమానులు ఇతనిని ప్రేమగా జక్కన అని పిలిచుకుంటారు. అతనే మన దర్శక ధీరుడు యస్ యస్ రాజమౌళి. ఈ దర్శుకుడితో యాంగ్ అండ్ డైనమిక్ హీరోస్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి మొదటి సారి ఒక్కే సినిమాలో కనిపించనున్నారు. ఈ తాజాగా ఈ చిత్రం యూనిట్ మరో పోస్టర్ ను విడుదల చేసింది.

 

రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం గురించిన సమస్త సమాచారాన్ని ఎంత రహస్యంగా ఉంచినా, ఏదో ఒక రూపంలో లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్ వంటి స్టార్లు నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

 

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి రామరాజుగా నటిస్తుండగా, ఆయన సరసన సీతగా ఆలియా భట్ నటిస్తోంది. రామరాజుగా రామ్ చరణ్, సీతా మహాలక్ష్మిగా ఆలియా భట్ ఇలాగే కనిపించనున్నారంటూ, ఓ రెండు చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతున్నాయి. 

 

ఎన్నడో తీసిన పాతకాలం నాటి చిత్రాలుగా ఇవి కనిపిస్తున్నాయి. వీటిని సినిమా కథానుసారం, ఫైల్ ఫొటోలుగా వినియోగించారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఫొటోలో రామ్ చరణ్, బ్రిటీష్ సైనిక అధికారిగా కనిపిస్తున్నాడు. ఇక అల్లూరి సీతా రామరాజు తన జీవితంలో బ్రిటీష్ అధికారిగా పని చేయలేదు. ఇక ఈ ఫొటో వెనకున్న స్టోరీ ఏంటి? అది ఎలా వచ్చిందో తెలియాలంటే, ఈ సినిమా విడుదలయ్యేంత వరకూ ఆగక తప్పదు.

 

కాగా, ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని అంటున్న వారూ లేకపోలేదు. ఏది ఏమైనా 'ఆర్ఆర్ఆర్' గురించి బయటకు వచ్చే ఏ సమాచారం అయినా, అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తుంది కాబట్టి, ఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: