టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ నటుల వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు.  అక్కినేని ఫ్యామిలీ నుంచి అక్కినేని నాగార్జున తర్వాత సుమంత్, సుశాంత్, నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా పరిచయం అయ్యారు.  ఆయన మేనకోడలు ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  ఆ తర్వాత ఆమె వెండితెరపై కనిపించలేదు.  ఆ మద్య అడవిశేషు నటించిన గూఢాచారి మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించింది సుప్రియ.  ఇక యువ హీరో సుశాంత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్ళు గడుస్తున్నా సరైన సక్సెస్ ని అందుకోవడం లేదు. కమర్షియల్ యాంగిల్ లో సక్సెస్ అవుదామనుకున్న సుశాంత్ ఎన్నుకొనే కథల విషయంలో తప్పులు చేస్తున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.  

 

ఆ మద్య   హీరో నుంచి దర్శకుడిగా మారినా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో చి.ల.సౌ సినిమాతో కాస్త పరవాలేదు అనిపించుకున్నా తర్వాత ఛాన్సులు మాత్రం రాలేదు.  ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ మూవీలో సుశాంత్ కీ రోల్ పోషించినా పేరు మాత్రం రాలేదు.  

 

తాజాగా దీనిపై స్పందించిన సుశాంత్  తన స్క్రీన్ టైం, కేరెక్టర్ పరంగా చెప్పాల్సి వస్తే.. భారీ తారాగణంతోనూ, ప్రతిభావంతులైన సాంకేతిక బృందంతో పనిచేస్తున్నప్పుడు, టీం ప్లేయర్ గానే ఉండాలి కానీ ఎక్కువ ఎక్సపెక్ట్ చెయ్యకూడదని అన్నారు.  తన పాత్ర విషయంలో తాను చాలా సంతృప్తిగా ఉన్నానని అన్నారు.  అల వైకుంఠపురములో తనకి సంబందించిన ఫన్నీ సీన్స్ ని యూట్యూబ్ లో విడుదల చేస్తున్నట్టుగా చెబుతున్నాడు. ఏది ఏమైనా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠపురములో సూపర్ డూపర్ హిట్ కావడమే కాదు నాన్ బాహుబలి రికార్డులు కూడా బ్రేక్ చేసింది.  ఇందులో పాటలు ఇప్పటికీ యూట్యూబ్ లో సంచలనాలు రేపుతూనే ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: