ఒక‌ప్పుడు సినిమాల‌న్నీ కూడా ఎంతో మంచి క‌థ క‌థ‌నాల‌తో అద్భుత‌మైన స్క్రీన్‌ప్లేతో తెర‌కెక్కేవి. అవ‌న్నీ కూడా ఎంతో మంచి ఉమ్మ‌డి కుటుంబాల బంధాలు, అస‌లు సంసారం అంటే ఏమిటి, భార్యాభ‌ర్త‌ల బంధం ఎలా ఉంటుంది. ఎలాంటి సినిమాలు ప్రేక్ష‌కులు ఎక్కువ ఆద‌రించేవారు. అనే వాటి పై ఎక్కువ‌గా సినిమాలు వ‌చ్చేవి. అప్ప‌ట్లో ద‌ర్శ‌కులు కూడా ఎంతో వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కిస్తూ ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌ల‌ను సంపాదించారు. ఉదాహ‌ర‌ణ‌కి సంసారం చ‌ద‌రంగం, పండంటి కాపురం, ప‌చ్చ‌ని సంసారం, ప‌చ్చ‌ని కాపురం, కొడుకు దిద్దిన కాపురం, ధ‌ర్మాత్ముడు ఇలా విభిన్న‌మైన క‌థ‌ల‌తో చిత్రాలు తెర‌కెక్కేవి. 

 

కానీ ఇటీవ‌ల కాలంలో వ‌చ్చే చిత్రాలేవీ కూడా అలా ఉండ‌డం లేదు.  ఎక్క‌డో ఒకటో రెండో చిత్రాలు త‌ప్పించి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చూడాల‌న్నా చాలా అరుద‌యిపోయాయి. ఉదాహ‌ర‌ణ ఇటీవ‌లె వ‌చ్చిన ఎఫ్‌2, ప్ర‌తిరోజూపండ‌గే, స‌మ్మోహ‌నం లాంటి చిత్రాలు అతి త‌క్కువ‌గా ఉంటున్నాయి. ఎంత‌కీ నేటి యువ ద‌ర్శ‌కులంద‌రూ కూడా ఎక్కువ‌గా బోల్డ్ కంటెంట్ తీసుకుని బోల్డ్ కంటెంట్ మీద ఆధార‌ప‌డి ఉన్న చిత్రాలే ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. భార్యాభ‌ర్త‌ల శృంగార స‌న్నివేశాలు కూడా సినిమాల్లో చూపిస్తూ... గుట్టుగా ఉండేది కూడా ర‌ట్టు చేస్తున్నారు కొంద‌రు ద‌ర్శ‌కులు.  కేవ‌లం వాటితో ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు రాబ‌ట్ట‌ల‌నే ఉద్దేశంతో యువ‌త‌ను ఆక‌ర్షించాల‌నుకుంటున్నారు. ఆ చిత్రాల యొక్క‌ ప్ర‌భావం సమాజం పై ఎంత ప‌డుతుంది అన్న‌ది మాత్రం అస్స‌లు ఆలోచించ‌డం లేదు. 

 


నేటి చిత్రాల‌న్నీ దాదాపుగా ల‌వ్‌లు త‌ల్లిదండ్రుల‌ను ఎదిరించి వివాహం చేసుకునేవి. లేదంటే ఇంకాస్త ముందుకెళ్ళి మ‌రింత లోతుగా సినిమాల‌ను చూపించ‌డం త‌ప్పించి అస‌లు పెద్ద‌లు వారికిచ్చే గౌర‌వాలు, ప్రేమ‌, పెళ్ళిబంధాలు, ఇలాంటి వాటి పై స‌రైన అవ‌గాహ‌న లేకుండా పోతుంది. ఇలాంటి చిత్రాల‌కే చాలా మంది ఎట్రాక్ట్ అవుతున్నారు. వాటి వ‌ల్ల వ‌చ్చే ఇబ్బందుల గురించి మాత్రం చాలా త‌క్కువ మంది ఆలోచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: