ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి వైజాగ్ వెళ్ళిపోవటం దాదాపు ఖాయం కావడంతో ఇప్పుడు తెలుగు సినిమా పెద్దలు చాలా మంది వైజాగ్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే వైజాగ్ ఏరియాలో భూములు కొన్న వాళ్ళు అంది వచ్చిన ఈ అవకాశాన్ని వాడుకుని తమ వ్యాపార కార్యకలాపాలకు వైజాగ్ ను ఎలా వాడుకోవాలి అని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వైజాగ్ టాలీవుడ్ ఏర్పాటులో భాగంగా ఫిలిం స్టూడియోను సైతం ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ వైజాగ్ లో ఇప్పటికే తనకు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

 

ఇక మ‌రో సీనియ‌ర్ హీరో నాగార్జున‌తో పాటు సీనియ‌ర్ హీరోయిన్ అనుష్క సైతం వైజాగ్ రియ‌ల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబ‌డులు పెట్టిన‌ట్టు టాక్‌. ఇక ఇప్పుడు ఈ కోవలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. మహేష్ బాబు ఇటీవలే ఏషియ‌న్‌ సినిమాస్ నేతలతో కలిసి థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ గచ్చిబౌలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఏఎంబీ సినిమాస్‌ బాగా సక్సెస్ అవడంతో ఇప్పుడు అదే తరహాలో కర్నాటక రాజధాని బెంగళూరులో భారీగా మ‌రో ఏఎంబీ మాల్‌ నిర్మిస్తున్నారు.

 

ఇక ఇప్పుడు వీరి వ్యాపార సామ్రాజ్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌లు సిటీల‌కు విస్త‌రించేలా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇక వైజాగ్ ఏపీ రాజ‌ధాని అయితే ఆ సిటీ మ‌రింత డ‌వ‌ప‌ల్ అవ్వ‌డంతో పాటు దేశంలోనే పెద్ద న‌గ‌రాల జాబితాలోకి వెళ్లిపోతుంది. ఈ క్ర‌మంలోనే అక్క‌డ కూడా త‌మ బిజినెస్ విస్త‌రించేందుకు మ‌రో ఏఎంబీ సినిమా మాల్‌ను ఏర్పాటు చేయాల‌ని మ‌హేష్‌, ఏషియ‌న్ వాళ్లు ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తున్నార‌ట‌. ఒక్క వైజాగ్‌లోనే కాకుండా ఏపీలోని ప‌లు ప్ర‌ధాన న‌గరాల్లోనూ ఈ బిజినెస్ విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: