మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పని చేయడానికి చాలా మంది హీరోలు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్...చాలామంది ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరి ని కవర్ చేశాడు. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురంలో సినిమా తెరకెక్కించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ హిట్ సాధించాడు. ఫస్ట్ నుండి కమర్షియల్ హీరోలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్.

 

అయితే ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ లో అక్కినేని నాగార్జున తో మన్మధుడు సినిమా తీసిన తర్వాత మరొక సినిమా ఫ్యామిలీ లో ఉన్న హీరోలతో త్రివిక్రమ్ చేయలేదు. ఇదే సందర్భంలో అక్కినేని అఖిల్ ని డైరెక్ట్ చేయాలని త్రివిక్రమ్ ని నాగార్జున కోరినట్లు దానికి త్రివిక్రమ్ తిరస్కరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సమయంలో మన్మధుడు సీక్వెల్ సినిమా తీసిన నేపథ్యంలో నాగార్జున కూడా త్రివిక్రమ్ పేరు చెప్పకుండా స్పీచ్ ఇవ్వటం అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద హైలైట్ అయింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా త్రివిక్రమ్ అక్కినేని ఫ్యామిలీలో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న నాగచైతన్య తో కలిసి త్వరలో సినిమా చేయనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

నాగ చైతన్య హీరోగా పెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక హాసిని క్రియేషన్స్ ఫై సినిమా ని తీసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే నాగ చైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ చిత్రంలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ తో నాగ చైతన్య సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. 'అలా వైకుంఠపురంలో' సినిమా తర్వాత ఎన్టీఆర్ తో చేద్దామనుకున్న త్రివిక్రమ్ కి rrr సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో నాగ చైతన్య తో కానిచ్చే పనిలో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం.  అయితే అధికారికంగా మాత్రం ఈ వార్తలు ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: