కోలీవుడ్ లో సూపర్ హిట్టైన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకోగా.. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే ఆ లెక్క వేరేలా ఉంటుంది కాని ఫుల్ ఎమోషన్స్ తో కూడిన క్లాసిక్ మూవీని రీమేక్ చేయడం ఎందుకని అన్నారు. ఇంతకీ ఇక్కడ ప్రస్థావించేది ఏ సినిమా గురించో ఇప్పటికే కనిపెట్టి ఉంటారు. రీసెంట్ గా రిలీజైన జాను సినిమా తమిళంలో సూపర్ హిట్టైన 96 మూవీ రీమేక్ గా వచ్చింది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమాను మాత్రుక దర్శకుడు ప్రేమ్ కుమారే తెలుగులో కూడా డైరెక్ట్ చేశారు.  

 

జానులో శర్వానంద్, సమంత కలిసి నటించారు. సమంత తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. అయితే సమంత ఉన్నా సరే సినిమాను కాపాడలేకపోయింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసిన దిల్ రాజు జాను పాత్రకు సమంతనే మొదటి ఆప్షన్ అనుకున్నాడు. కాని 96 చూసిన తర్వాత దాన్ని రీమేక్ చేయకుండా ఉంటే బెటర్ ఆ సినిమాలో తను నటించకపోవడం ఇంకా మంచిదని భావించిందట సమంత. అందుకే దిల్ రాజుకి ముందు నో చెప్పిందట.

 

అయితే సమంత కుదరదని చెప్పిన టైంలో దిల్ రాజు ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న కన్నడ భామ రష్మిక మందన్నని జానుగా నటించమని అడిగాడట. రష్మిక కూడా ఇది వర్క్ అవుట్ కాదని తెలుసుకుని ముందే జాగ్రత్త పడ్డది. దిల్ రాజు ఫ్యాన్సీ ఆఫర్ ను సైతం కాదని రష్మిక జాను చేయనని చెప్పేసింది. ఫైనల్ గా సమంత జానుగా వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు కాని సినిమాలో నటించినందుకు శర్వానంద్, సమంత ఇద్దరు ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. అయితే తమిళంలో క్రియేట్ చేసిన మ్యాజిక్ మాత్రం ఇక్కడ క్రియేట్ చేయలేకపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: