మన టాలీవుడ్ సినిమా నటుల్లో దాదాపుగా చాలా మంది హీరోలు ఎప్పటికప్పుడు తమ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవడం, అలానే వారిలో ఎవరికైనా సమస్యలు ఉంటె, తమకు అవకాశం ఉన్న మేరకు వారికి సాయాన్ని అందించడం వంటివి చేస్తున్నారు. ఇక వాటితో పాటు మన రాష్ట్రాల్లో ఏవైనా వరదలు, విపత్తుల వంటివి సంభవించినపుడు తమవంతుగా ముందుకు వచ్చి విరాళాల వంటివి కూడా ఇచ్చి తమ గొప్ప మనసు చాటుకున్న సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. 

 

అలానే వాటితో పాటు తమకు వస్తున్న ఆదాయంలో కొంత మొత్తాన్ని పలు సేవా కార్యక్రమాలకు నియోగిస్తున్న హీరోలు కూడా మరికొందరు ఉన్నారు. ఇక ఆ విధంగా మంచి పేరుతో దూసుకుపోతున్న నటుల్లో యువ నటుడు విజయ్ దేవరకొండ కూడా చేరాడు. గతంలో తన సినిమాల రిలీజ్ లు, అలానే జన్మదినం సమయంలో పలు ఛారిటీ కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు దక్కించుకున్న ఈ రౌడీ హీరో, నేడు ఏకంగా రూ.5 లక్షల రూపాయల చెక్ ని ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందచేయడం జరిగింది. 

 

ఒక సినిమా ప్రారంభ సమయం నుండి దాని షూటింగ్ ప్రోగ్రెస్ తో పాటు పబ్లిసిటీ, ఆ తరువాత రిలీజ్ అయ్యాక దానిని మరింతగా ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర వహించే మీడియా వారికి నా వంతుగా ఈ సాయం అందించడం ఆనందంగా ఉంది, ఇకపై భవిష్యత్తులో వారికి మరింతగా సాయం అందించడానికి ముందుంటాను అంటూ విజయ్ మాట్లాడుతూ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం కాసేపటి క్రితం బయటకు రావడంతో విజయ్ పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇదే అసోసియేషన్ కే రూ.10 లక్షలు అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: