ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం మార్కెట్ మీద కన్నేశారు. వసూళ్లు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఒక హీరోతో మరో హీరో సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. దీనికి తోడు దర్శకులు కూడా కథలను ఆ విధంగానే రాసుకున్న నేపధ్యంలో టాలీవుడ్ లో ఇప్పుడు ఈ సందడి ఎక్కువైంది. వచ్చే ఏడాది మొత్తం ఒక హీరో తో మరో హీరో నిర్మాతగా చేయడమో లేక మల్టీ స్టారర్ సినిమా చేయడమో చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా కమర్షియల్ మార్కెట్ మీద దృష్టి పెట్టారు. 

 

ఇక రానా కూడా సైలెంట్ గా అదే పనిలో ఉన్నాడు. వచ్చే ఏడాది ఒక స్టార్ హీరోకి నిర్మాతగా చేసే ప్లాన్ చేస్తున్నాడు రానా. ఇదిలా ఉంటే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దూకుడు మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. వరుసగా నిర్మాతగా, హీరో గా సినిమాలు చేసుకుంటూ ముందుకి వెళ్తున్నాడు. ఇందులో భాగంగానే తన తండ్రి తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే మరో సినిమాను కూడా లైన్ లో పెడుతున్నాడు. లూసిఫర్ అనే సినిమాను కూడా ప్లాన్ చేసాడు. 

 

ఇక ఇప్పుడు విక్టరి వెంకటేష్ తో ఒక సినిమా చెయ్యాలని చూస్తున్నాడు. ఒక మలయాళం సినిమాను చేసే ఆలోచన చేస్తున్నాడు ఈ యువ హీరో. దీనికి ఇప్పటికే వెంకటేష్ ని కూడా సంప్రదించాడు అని టాక్. దీనికి వెంకటేష్ కూడా ఓకే చెప్పారట. ఈ సినిమా పేరు డ్రైవింగ్ లైసెన్స్ అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు రామ్ చరణ్ దూకుడు మాత్రం టాలివుడ్ హీరోలను కూడా షాక్ కి గురి చేస్తుంది. ఇలా నిర్మాతగా హీరోగా సినిమాలు చేయడంతో భారీ మార్కెట్ చేస్తున్నాడని, తాము కూడా అలా ప్లాన్ చేసుకోవాలని చూస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: