ఫిల్మ్ జర్నలిస్ట్‌ల సంక్షేమమే పరమావధిగా ఏర్పడిన ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా(ఎఫ్‌ఎన్‌ఏఈఎమ్)కు యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి (‘చూసీ చూడంగానే’ ఫేమ్) చేయూతనందించారు. ఫిల్మ్ జర్నలిస్టుల కోసం కృషి చేస్తున్న ఎఫ్‌ఎన్‌ఏఈఎమ్‌కు విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు, శివ కందుకూరి రూ. లక్ష విరాళం అందచేశారు. 

 

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘ఈ అసోసియేషన్ చేస్తున్న సేవలు ఎంతో గొప్పవి. వాటి గురించి తెలుసుకున్న తర్వాత నాకు కూడా వీరికి చేయూతనివ్వాలనిపించింది. అందుకే నా వంతుగా ఈ సాయం చేస్తున్నాను’’ అని విజయ్ పేర్కొన్నారు. మంగళవారం తన జన్మదిన వేడుకలు జరుపుకున్న యువ హీరో శివ కందుకూరి ఎఫ్‌ఎన్‌ఏఈఎమ్‌ చేస్తున్న సేవ గురించి తెలుసుకొని వెంటనే రూ.1 లక్ష విరాళం అందజేశారు. ఉన్నత విలువలతో ముందుకెళ్తున్న ఎఫ్‌ఎన్‌ఏఈఎమ్ సంస్థకు సాయం చేసినందుకు తానెంతో సంతోషిస్తున్నట్లు వెల్లడించారు.

 

మీడియాకు జర్నలిస్ట్‌ సేవలు ఎంతో కీలకం.. కానీ వారి జీత భత్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అందుకే వారి ప్రాముఖ్యతను గుర్తించిన ప్రముఖులు వారికి చేయూతనందిస్తారు. యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశంలో సదరు జర్నలిస్ట్‌లను వారి విభాగాలవారీగా.. కృషి చేసిన వారికి గుర్తింపునిస్తారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేల మంది ప్రతినిధులు హాజరైన సభలో రాష్ట్రంలోని జర్నలిస్ట్ ల స్థితిగతులపై, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరిపి వారిని ఆదుకుంటారు.

 

ఆమధ్య తెలంగాణలో దాదాపు 31 జిల్లాల నుండి 4 వేలకు పైగా జర్నలిస్టులు ప్రతినిధుల సభలో పాల్గొన్నారు.  గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్టుల నుండి పట్టణాల వారీగా అందరూ సమావేశమై వారి వారి వ్యధలను వెళ్లబుచ్చుకున్నారు. కనీస వేతలనాల అమలు జరగకపోగా జర్నలిస్ట్ ల నుంచే డబ్బులు వసూలు చేస్తూ పేపర్ లు ఛానెల్ లు నడుపుతున్న వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని,  యాజమాన్యాలు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని కూడా ఈ సభలో సదరు విలేఖరులు ప్రతిపాదించిన సంగతి తెలిసినదే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: