బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమా సాహో... ఆ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చింది. ఇక ఆ సినిమా కు ఒక రేంజ్ లో ప్రచారం చేసారు. ఈ రోజుల్లో ప్రచారం ఉంటేనే సినిమా హిట్ అయినట్టు కాబట్టి ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఎంత జనాల్లోకి వెళ్తే అంత లాభం మరి. అందుకే స్టార్ హీరోలు చిన్న హీరోలు ఇప్పుడు అంతగా ప్రచారం చేస్తున్నారు. చాలా సినిమాలు ఈ మధ్య ప్రచార హడావుడి తోనే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. అలాగే సాహో సినిమాను భారీగా ప్రచారం చేసారు. 

 

కాని ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. ఆ ప్రచారం తో నష్టాల నుంచి బయటపడ్డారు. లాభాలు భారీగా వచ్చేసాయి. ఇక సైరా సినిమా విషయంలో కూడా ఇదే రేంజ్ లో ప్రచారం చేసారు. అసలు ఆ సినిమాకు చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కాని ఆ సినిమా ఘోరం గా ఫ్లాప్ అయింది. ఇక సచిన్ బయోపిక్ సినిమా కూడా ఇలాగే ప్రచారం చేసారు. సచిన్ తన చిన్న నాటి విశేషాలను మీడియా ముందు ఎంతగానో ప్రచారం చేసారు. అయినా సరే సినిమా ఫ్లాప్ అయింది. 

 

ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. తాజాగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ ని కూడా అలాగే ప్రచార౦ చేసారు. కాని ఆ సినిమా వరల్డ్ ఫేమస్ రాడ్ అయింది. ఇక నితిన్ నటించిన భీష్మ సినిమా విషయానికి వస్తే మీడియా ముందు చాలా ప్రచారం చేస్తున్నారు. దీనితో ఈ సినిమా మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ప్రచారం చేస్తే సినిమా ఫ్లాప్ అనే అభిప్రాయానికి జనాలు వచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై పలువురు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ప్రచారం లేకుండా వస్తే సూపర్ హిట్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: