టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన భద్ర అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బోయపాటి శ్రీను, తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. దిల్ రాజు ఆయనను దర్శకుడుగా పరిచయం చేయడం జరిగింది. ఆ తరువాత ఆయన వెంకటేష్ తో తీసిన తులసి, అలానే నందమూరి బాలకృష్ణ హీరోగా తీసిన సింహా సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచి బోయపాటి కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఆ తరువాత ఎన్టీఆర్ తో ఆయన తీసిన దమ్ము ఫ్లాప్ అవ్వగా, అనంతరం వచ్చిన లెజెండ్, సరైనోడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. 

 

ఆపై బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి తీసిన జయ జానకి నాయక పర్వాలేదనిపించగా, ఇటీవల రామ్ చరణ్ హీరోగా తీసిన వినయ విధేయ రామ ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇక బాలయ్యతో అతి త్వరలో ఒక సినిమాని తీయనున్న బోయపాటి, ఆ సినిమాని ఎలాగైనా మంచి హిట్ హిట్ చేయాలని కథను ఎంతో పకడ్బందీగా సిద్ధం చేశారట. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ముందుగా రూ. 40 కోట్ల నుండి రూ. 50 కోట్ల వరకు ఖర్చు అవుతుందని భావించినప్పటికీ, సినిమాలోని కొన్ని కీలక సీన్స్ కోసం మరింతగా ఖర్చు పెట్టాలని, లేకుంటే సినిమాలో ఫీల్ దెబ్బతింటుందని నిర్మాతతో బోయపాటి అన్నారట. 

 

అయితే ఆ విధంగా ఖర్చు చేస్తే సినిమాకు ఏకంగా రూ.80 కోట్లు ఖర్చు అవుతుందని భావించిన నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి, కొంత ఆలోచనలో పడ్డట్లు చెప్తున్నారు. సినిమా హిట్ అయితే కనుక ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పెట్టుబడి రాబట్టడం పెద్ద విషయమేమి కానప్పటికీ, ఒకవేళ సినిమా అటు ఇటు అయితే మాత్రం అసలుకే మోసం వస్తుందని నిర్మాత యోచిస్తున్నారని టాలీవుడ్ వర్గాల టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలియాల్సి ఉంది...!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: