టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ డి రామనాయుడు తనయుడు దగ్గుబాటి వెంకటేష్ ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  ఈ మూవి మంచి సక్సెస్ అయ్యింది.  ఆ తర్వాత యాక్షన్, ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటిస్తున్న వెంకటేష్ ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నారు.  తాజాగా వెంకటేష్ తో బొబ్బిలి రాజా సినిమాకు దర్శకత్వం వహంచిన బి గోపాల్సినిమా గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  వెంకటేష్ కెరీర్ లో బొబ్బిలిరాజా సూపర్ హిట్ సినిమా గా నిలిచింది.  విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయ విహారం చేసింది. అలాంటి ఈ సినిమాకి బి.గోపాల్ దర్శకుడిగా వ్యవహరించాడు. 

 

'బొబ్బిలి రాజా' సినిమా క్లైమాక్స్ ను నంద్యాల ఫారెస్టులో చిత్రీకరించాము. గూడ్స్ రైలుపై ఫైట్ సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బోగీ లోపల 200 పాములకు సంబంధించిన సీన్ ను .. నాయుడిగారి స్టూడియోలో వేసిన సెట్లో చిత్రీకరించాము.  ప్రపంచంలో ఎవరికైనా పాములు అంటే ఎంత భయం ఉంటుందో తెలిసిందే.  వాటికి విషయం లేదని తెలిసి కూడా ఎవరైనా దూరంగానే ఉంటారు.  కారణం చిన్నప్పటి నుంచి పాములు అంటే భయంగా పెరగడం.  అయితే సినిమా షూటింగ్ లో కొన్ని సార్లు పాములతో నటించాల్సిన పరిస్థితి వస్తుంది. 

 

అయితే ఒకటీ రెండు అయితే ఓకే కానీ వందల పాముల మద్య నటించాల్సి వస్తే... రక రకాల పాముల మద్యలో నటించాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవొచ్చు.   బొబ్బిలి రాజా మూవీలో  200ల పాముల మధ్య వెంకటేశ్ చాలా ధైర్యంగా కూర్చుని చేశాడు. ఒక పాము నిజంగానే ఆయన మెడ వరకూ పాకింది. అయినా భయపడకుండా ఆయన చేశాడు  అని చెప్పుకొచ్చారు బి గెోపాల్.  ఏది ఏమైనా కెరీర్ పరంగా ఆయనకు ఈ సినిమా తీసుకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: