సినీ పరిశ్రమలో రాణించాలి అంటే నటనతో పాటుగా డాన్స్ కూడా చాలా కీలకం. అయితే చాలా మంది హీరోలు తమకు ఉన్న స్టార్ ఇమేజ్ తో డాన్స్ లేకుండా నెట్టుకుంటూ వచ్చేస్తారు. కాని మెగాస్టార్ చిరంజీవి లో మాత్రం ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. సినిమాకు తన నుంచి ఎం కావాలో ఇవ్వగల నటుడు చిరంజీవి. చిరంజీవి సినిమా విడుదల అయింది అంటే ఆయన డాన్స్ గురించి ప్రత్యేకంగా చర్చలు జరుగుతూ ఉంటాయి. కెరీర్ తొలి నాళ్ల నుంచి కూడా నేటి వరకు చిరంజీవి డాన్స్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 

 

ఒకానొక టైం లో ఆయన్ను తెలుగు మైకేల్ జాక్సన్ అని కూడా కీర్తించారు సినీ విశ్లేషకులు. ఏ సినిమా అయినా సరే తన డాన్స్ తో సినిమాకు ఒక అందం తీసుకొస్తారు చిరంజీవి. ఇప్పటి వరకు కూడా టాలీవుడ్ లో ఏ హీరో కూడా చిరంజీవి దాటి వెళ్లలేకపోయారు అనేది వాస్తవం. ఆయన ముందు ఆయన తర్వాత ఎందరో హీరోలు వచ్చినా చిరూ చూపించిన వైవిధ్యం ఎవరూ చూపించలేదు. డాన్స్ మాస్టర్లు కూడా ఆయన స్టెప్పులు చూసి ఫిదా అయిపోయారు. డాన్స్ అంటే ఇండియన్ సినిమాలో చిరు పేరే ప్రస్తావిస్తారు. 

 

అది ఏ సినీ పరిశ్రమ అయినా సరే. చిరంజీవి తర్వాత ఎందరో నటులు సిని పరిశ్రమకు పరిచయం అయ్యారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జగపతి బాబు, శ్రీకాంత్, బాలకృష్ణ, ఇలా ఎవరిని చూసుకున్నా సరే చిరంజీవి స్థాయిలో డాన్స్ చేయలేరు అనేది వాస్తవం. టాలీవుడ్ లో చిరంజీవి ఎప్పటికే డాన్స్ లో రారాజే. ఇప్పుడు ఆయన తనయుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చిరంజీవి స్టెప్స్ చూసి డాన్స్ నేర్చుకుంటాడు అని అంటూ ఉంటారు. చిరంజీవి వీడియో లు చూస్తే చాలు డాన్స్ వస్తుంది అంటారు. దక్షిణాదిలో ఎటు నుంచి ఎటు చూసుకున్నా చిరునే టాప్.

మరింత సమాచారం తెలుసుకోండి: