చిరంజీవి సినిమాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించేది డాన్స్. ఆయన నటనకు ఎంత మంది అభిమానులు ఉంటారో, డాన్స్ కి కూడా అంతే అభిమానులు ఉంటారు. ఆయన నటనకు ఉండే అభిమానులకు వర్గాలు కులాలు ఉండవచ్చు ఏమో గాని చిరంజీవి డాన్స్ ని మాత్రం ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ఆయన వేసే స్టెప్, డూప్ లేకుండా చేసే డాన్స్ ఫీట్లు, అన్నీ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అనేది వాస్తవం. అందుకే ఆయన సినిమాలు చూడటానికి డాన్స్ కోసం వెళ్ళే అభిమానులు ఎక్కువగా ఉంటారు. 

 

పదేళ్ళ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వగానే, సినిమా రివ్యూలలో డాన్స్ లో అదే జోష్ అన్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఆయన తెలుగు సినీ పరిశ్రమకు ఒక డాన్స్ ని పరిచయం చేసారు. అదే బ్రేక్ డాన్స్. అప్పటి వరకు ఆ పదాన్ని టాలీవుడ్ వినడమే గాని చూడటం అనేది ఎక్కడా లేదు అనే చెప్పాలి. కాని చిరంజీవి దాన్ని చేసి చూపించారు. పసివాడి ప్రాణం అనే సినిమాతో ఈ చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా బ్రేక్ డ్యాన్స్ చేసిన ఘనత చిరంజీవికి దక్కింది. ఆ సినిమాలో ఆ డాన్స్ హైలెట్. 

 

ఆ డాన్స్ చూసి అప్పట్లో బాలీవుడ్ హీరోలు కూడా షేక్ అయ్యారు. అప్పుడే బాలీవుడ్ డాన్స్ మాస్టర్లు కూడా చిరంజీవి సినిమాల వీడియోలను తెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఏ డాన్స్ అయినా చేయగల సత్తా చిరంజీవి సొంతం. అందుకే దర్శకులు కూడా చిరంజీవి డాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏది ఎలా ఉన్నా సరే దక్షిణాది హీరోలలో డాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదని అంటారు ఆయన అభిమానులు. అప్పుడు తెలుగు హీరోలు కూడా షాక్ అయ్యారట ఆ డాన్స్ చూసి.

మరింత సమాచారం తెలుసుకోండి: