ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణా ఈ ముగ్గురు హీరోలది ఒక శైలి అయితే చిరంజీవిది మాత్రం ఒక శైలి. వాళ్ళ గురించి పక్కన పెట్టి చిరూ గురించి మాట్లాడితే, చిరంజీవి సినిమాను ప్రేమించారు, ఆరాధించారు, ఇష్టపడ్డారు, సినిమానే జీవితం అనుకున్నారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అవమానాలు ఎదుర్కొన్నారు. సహకారం లేక అవస్థలూ పడ్డారు. అయినా సరే చిరంజీవి టాలీవుడ్ లో నిలబడ్డారు మెగాస్టార్ అయ్యారు. చిరంజీవి జీవితంలో ఏ క్షణం చూసినా సరే సినిమానే ఉంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. 

 

అయితే ఆయన పదేళ్ళ పాటు సినిమాకు దూరం అయ్యారు. అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లోకి రావాలని భావించారు. ఈ విధంగా అడుగులు వేసారు. ప్రాణానికి ప్రాణం అయిన సినిమాను వదిలేసారు. పదేళ్ళ పాటు సినిమా వైపు మనసు లాగినా సరే ఆయన కంట్రోల్ చేసుకున్నారు. ఎందరో దర్శకులు అన్నయ్యా సినిమా చేద్దాం అని ఇంటికి వెళ్ళినా ఆయన మాత్రం ఆలోచనలోనే ఉండిపోయారు గాని మేకప్ వేసుకోలేదు. సినిమాల్లోకి వెళ్తే ఏమవుతుందో అనే ఆందోళన. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమా ఫంక్షన్ లో ఒక మాట అన్నారు చిరంజీవి. 

 

ఇది కదా నా ఏరియా, ఇది కదా నా ఇల్లు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అభిమానులను చూడగానే ఇదే అర్ధమైంది నాకు అన్నారు. ఆ తర్వాత చిరంజీవి సినిమాలు చేయడానికి చాలా ఆసక్తి చూపించారు. సొంత అభిమానులు కూడా రాజకీయాలు మీకు సరిపడవు సినిమాల్లోకి రండి అన్నయ్యా అంటూ లేఖలు కూడా రాసారు. ఎట్టకేలకు చిరూ మేకప్ వేసారు. ఇప్పుడు వరుస సినిమాలు చేసారు. ఆ పదేళ్ళ పాటు తన సమకాలీకులు వరుసగా సినిమాలు చేస్తున్నారు. హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా చేస్తున్నారు. కాని తనను అంతటి వాడిని చేసిన సినిమాను వదులున్న చిరంజీవి ఏది ఏమైనా సరే మళ్ళీ మేకప్ వేసుకుని నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: