ఇంద్ర, ఠాగూర్ ఈ రెండు సినిమాలు కూడా చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్. ఆ రెండు సినిమాల తర్వాత చిరంజీవిని అన్ని వర్గాల అభిమానులు ఆదరించారు. 2000 దశకం తర్వాత వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా టాలీవుడ్ ని షేక్ చేసాయి. ఊహించని విధంగా విజయాలను సాధించాయి. ఈ సినిమా రికార్డులను అందుకోవడానికి చిరంజీవి సమకాలీకులు ప్రయత్నాలు చేసినా అందుకోలేక ఇబ్బంది పడ్డారు. ఇక ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల్లో కూడా చిరంజీవి లుక్స్ గాని సినిమా కథలు గాని ఆకట్టుకున్నాయి. 

 

ఇంద్ర సినిమాలో వైట్ అండ్ వైట్ లో చిరంజీవి చూసి ఫిదా అయిపోయారు. అప్పటికే ఆయనకు దాదాపు 50 ఏళ్ళు ఉన్నాయి. అయినా సరే చిరంజీవి గ్లామర్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. అప్పుడే ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అంటూ చాలా మంది మనసు లో మాట ను బయటపెట్టారు. ఠాగూర్ సినిమా కథ కూడా విశేషంగా ఆకట్టుకుంది. అవినీతి మీద పోరాటం అంటూ ఆ సినిమా సబ్జెక్ట్ ఎంతో ఆకట్టుకుంది. ఆ సినిమా ద్వారా చిరంజీవి అన్ని వర్గాల అభిమానులను సంపాదించుకున్నారు. 

 

ఆయనలో ఒక ఆవేశం ఉందని అది రాజకీయాలకు పనికొస్తుంది అన్నారు అభిమానులే. దీనితో చిరంజీవి కూడా దాని గురించి ఆలోచించారు. పలు ఛానల్స్ కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు అంటూ అప్పటి నుంచే కథనాలు రాయడం మొదలుపెట్టాయి. పత్రికల్లో కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. రాజకీయ పార్టీల నుంచి ఆయనకు ప్రేమ లేఖలు వెళ్ళాయి. ఆయన ఫాలోయింగ్ చూసి, తమ రాజకీయ పార్టీలకు ప్రచారం చేస్తే బాగుంటుంది అని భావించారు ఎందరో నాయకులు. చంద్రబాబు, వైఎస్ లాంటి నేతలు కూడా చిరంజీవి ఫాలోయింగ్ చూసి భయపడ్డారు. అలా ఆ రెండు సినిమాలు చిరంజీవిని ఎంతగానో వ్యక్తిగతంగా కూడా ప్రభావితం చేసాయి అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: