సామాజిక మాధ్యమాలు పరిధి విస్తృతం అయ్యాక ఏ రంగంలో పనిచేసే వారికి అయినా తమకంటూ సొంత గుర్తింపు వస్తోంది. గతంలో ఎవరైనా హైలెట్ అవ్వాలి అంటే కేవలం మీడియానే ప్రధాన ఆధారంగా ఉండేది. అందుకే అప్పట్లో మీడియా కు చాలా ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు సోష‌ల్ మీడియా ప్ర‌భావం బాగా పెరగడంతో ప్రధాన మీడియా సైతం సోషల్ మీడియా ను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎవరికివారు తమ సోషల్ మీడియాలో తమకు తాముగా హైలెట్ అవుతుండడంతో పాటు నిత్యం ప్రజలకు ట‌చ్ లో ఉంటున్నారు. ఇక హీరోయిన్ల‌లో కొంద‌రు అయితే ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ హాట్ హాట్ ఫొటోలు.. హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతున్నారు.

 

హీరోయిన్ల క్రేజ్ ను బ‌ట్టి వాళ్ల‌కు మిలియన్స్ కొద్దీ ఫాలోయర్స్ ఉంటుండడంతో హీరోయిన్లు కూడా గ్లామర్ పరంగా ఎక్కడా తగ్గడం లేదు. హార్ట్ అటాక్ సినిమాతో టాలీవుడ్ లో పాపులర్ అయిన నటి అదా శర్మ ఆ త‌ర్వాత ఎందుకో గాని క్లిక్ కాలేదు. అమ్మడికి అవకాశాలు తగ్గి చాలా ఏళ్లు అయ్యింది. రాజ‌శేఖ‌ర్‌తో ఆమె గ‌తేడాది న‌టించిన కల్కి తర్వాత ఆమె తెలుగులో మళ్ళీ నటించింది లేదు.

 

బాలీవుడ్‌లో అడ‌పా ద‌డ‌పా అవ‌కాశాలు వ‌స్తున్నా అక్క‌డ కూడా పేరు రావ‌డం లేదు. దీంతో ఆదా శ‌ర్మ త‌న ఇన్‌స్టా గ్రామ్ అక్కౌంట్లో త‌న హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఆమె ఫాలోవ‌ర్స్‌కు కావాల్సినంత అందాల విందు చేస్తుంది. హాట్‌గా అందాల ప్రదర్శన చేయడానికి ఎప్పుడూ అడ్డుచెప్పదు అమ్మడు. తాజాగా ఆదా శ‌ర్మ ఓ మ్యాగ‌జైన్ కోసం త‌న క్లీ వేజ్ అంద చందాలు బ‌య‌ట ప‌డుతూ ఫొటోలు పోస్ట్ చేసింది. మ‌రి ఈ అందాల ఆర‌బోత‌తో అయినా ఆదాకు అవ‌కాశాలు వ‌చ్చి ప‌డ‌తాయోమో ?  చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: