టాలీవుడ్ లో చేసినవి తక్కువ సినిమాలే బెల్లం బాబు కి అదే బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ కి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. బాబులో నటన డాన్స్, కాస్త ఫైట్స్ కూడా సీరియస్ గా చేయడం, బోయపాటి శ్రీను తో చేసిన సినిమా లో సీనియర్ హీరోల మాదిరి యాక్షన్ ఫైట్స్ చేయడంతో బాబు కి క్రేజ్ వచ్చింది. దీనితో అప్పటి నుంచి బాబు తో సినిమాలు చేయడానికి దర్శకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. 

 

ప్రస్తుతం బాబు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. జూన్ లేదా జూలై లో ప్రేక్షకుల ముందుకి వచ్చే ఈ సినిమా కోసం బాబు కాస్త ఎక్కువగా కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో నభా నటేష్ అనే హీరోయిన్ బాబు సరసన నటిస్తుంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నాడు దర్శకుడు. ఎలా అయినా సరే ఏప్రిల్ కి షూటింగ్ పూర్తి చేసి మే లేదా జూన్ లో సినిమా విడుదల చెయ్యాల్సిందే అనే పట్టుదలగా ఉన్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. ఇప్పటి వరకు బెల్లం బాబు లో చూడని యాంగిల్ ఈ సినిమాలో చూడవచ్చు అంటున్నారు అభిమానులు. ఎప్పుడు లేని విధంగా బాబు ఈ సినిమాలో హీరోయిన్ తో ఒక సీన్ లో లిప్ లాక్ చేస్తాడని టాక్ వినపడుతుంది. ఒక సన్నివేశం ట్రైన్ లో ఉంటుందని, అక్కడ విలన్స్ వచ్చినప్పుడు తప్పించుకోవడానికి బాబు లిప్ లాక్ చేస్తాడని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో ఎక్కువగానే వినపడుతుంది. కాగా ఈ సినిమాను సుబ్రహ్మణ్యం అనే నిర్మాత నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: