ఈ మద్య కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు టాలీవుడ్ లోకి డబ్ చేస్తున్న విషయం తెలిసిందే.  స్టార్ హీరోల సినిమాలు తెలుగు లో డబ్ కావడం.. మంచి హిట్ కూడా అందుకుంటున్నాయి.  తమిళ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, సూర్య తర్వాత ధనుష్ సినిమాలు కూడా తెలుగు మంచి ఆదరణ లభిస్తున్నాయి.  ఇటీవల ధనుష్ నటించిన మారి సినిమాకు మంచి హిట్ టాక్ వచ్చింది.  ప్రస్తుతం ధనుష్  లోకల్ బాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  ఈ చిత్రం పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది.  ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న తాజా మూవీ 'జగమే తంత్రం'. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

 

ఇందులో ధనుష్ డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్నారు. ఈ మూవీ పూర్తిగా మాఫియా నేపథ్యంలో సాగుతున్నట్లు మోషన్ టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది.  ధనుష్ మాఫియా డాన్ గా కనిపిస్తున్నాడు.  ధనుష్ 40వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథాంశం గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నుష్ లుంగీ కట్టి రెండు చేతులతో గన్స్ చేతపట్టి ఝడిపించేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాను కార్తీక్ సుబ్బరాజు రొటీన్ కి భిన్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని ఈ మోషన్ పోస్టర్ చెబుతోంది.

 

కబాలి ఫేమ్ సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  తో ఆకట్టుకుంటుంది. ఈ మూవీ  జేమ్స్ కాస్మో- ఐశ్వర్య లక్ష్మి - కలైరసన్- జోజు జార్జ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ ఛాయాగ్రహణం..  వివేక్ హర్షన్ ఎడిటింగ్ అస్సెట్ కానున్నాయి. యువి క్రియేషన్స్ - జిఎ 2 పిక్చర్స్ సంయుక్తంగా ఈ మూవీ తెలుగులో విడుదల చేస్తున్నాయి. వైనాట్ స్టూడియోస్ -రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: