నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన సినిమా `భీష్మ`. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌. ఫిబ్రవరి 21న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నితిన్‌ మీడియాతో మాట్లాడారు..


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `నేను `శ్రీనివాస కల్యాణం` సినిమా చేసేటప్పుడు డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ లైన్ చెప్పాడు. నాకు నచ్చింది. దాన్ని డెవలప్ చెయ్యడానికి సంవత్సరం టైం తీసుకున్నాడు. నా గత మూడు సినిమాలు ఆడలేదు కాబట్టి, ఈసారి స్క్రిప్ట్ పక్కాగా లాక్ చేసుకున్నాకే మొదలు పెడదామని అనుకున్నా. ఈ టైంలోనే 'రంగ్ దే' స్క్రిప్ట్, చంద్రశేఖర్ యేలేటి సినిమా స్క్రిప్ట్ కూడా విని ఓకే చేశాను. వాటి పూర్తి స్క్రిప్టులు అయ్యాకే మూడింటినీ మొదలుపెట్టాను. అలాగే కృష్ణచైతన్య చెప్పిన 'పవర్ పేట' స్క్రిప్ట్, హిందీ సినిమా 'అంధాధున్' రీమేక్ కూడా ఓకే చేశాను. ఈ ఏడాది బహుశా నావి నాలుగు సినిమాలు విడుదలవుతాయి.

 

`దిల్` తర్వాత నేను చేసిన లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ఇది. యాక్షన్ కూడా బాగా ఉంటుంది. ఇందులో ఆర్గానిక్ వ్యవసాయం అనేది ప్రధానాంశం కాదు. అది కథలో ఒక ఎలిమెంట్ మాత్రమే. భీష్మ ఆర్గానిక్స్ అనే కంపెనీ ఉంటుంది. అందులో నేనొక ఉద్యోగిని. ఆర్గానికి ఫార్మింగ్ అంటే దాని గురించిన సినిమా అని అంటారేమోనని దాన్ని ప్రమోషన్స్‌లో ఎలివేట్ చెయ్యలేదు. మీకు ట్రైలర్‌లో కనిపించి ఫైట్‌ అతడులోని పొలం ఫైట్ ను దృష్టిలో ఉంచుకొనే తీశాం. అది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.

 

మహతి స్వరసాగర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. `వాటే బ్యూటీ` కానీ, `సరాసరి గుండెల్లో` కానీ, సింగిల్స్ ఆంథం కానీ.. చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగా ఇచ్చాడు. అంతా 'ఛలో' టీం అయిపోతోందని, ముందు మహతినైనా మార్చమని వెంకీకి నేనే చెప్పా. మహతితో తనకు బాగా సింకవుతుందనీ, అతడితోనే మ్యూజిక్ చేయిద్దామనీ వెంకీ అనడంతో సరేనన్నా. మహతి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చి వెంకీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు` అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: