సౌత్ ఇండియా హాట్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ విడాకులు అయ్యి చాలా కాలమైనా ఇంకా ఈ వార్త మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అమలాపాల్ భర్త విజయ్ ల మద్య గొడవకి కారణం కోలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో అంటూ గతంలో మీడియా రంగంలో అనేక వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తమిళ హీరో మరెవరో కాదు ధనుష్ అంటూ విజయ్ తండ్రి క్లారిటీ ఇచ్చాడు. స్టార్ హీరో ధనుష్ వల్లే తన కొడుకు మరియు కోడలు విడిపోయారు అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు.

 

పెళ్లి తర్వాత సినిమాలు వదిలేయాలి అనుకున్న అమలాపాల్ తో ధనుష్ మళ్లీ సినిమాలో చేయడం వల్లే నా కొడుకు కోడలు ఇద్దరు మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని విజయ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లయిన తర్వాత సినిమాలు మొదలు కావటంతో అవి గొడవలు గా మరి విడాకుల దాకా వెళ్ళటం జరిగిందని అమలాపాల్ మరియు విజయ్ ఇద్దరు గొడవ పడటానికి విడాకులు తీసుకోవడానికి కారణం ధనుష్ అంటూ విజయ్ తండ్రి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

దీంతో విజయ్.. అమలా పాల్ విడాకుల మేటర్ సోషల్ మీడియాలో మరింతగా వైరల్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మేటర్ గురించి ధనుష్ ని ప్రశ్నించాలని మీడియా విలేకరులు ఎంత ట్రై చేస్తున్నా గాని ధనుష్ దొరకటం లేదు. అయితే ఈ విషయం గురించి అమలాపాల్ ని జర్నలిస్టుల ప్రయత్నించగా ఆమె వెంటనే సీరియస్ అయ్యింది. ఇటీవల ఆమె ఓ వేడుకకు బయటకు వచ్చిన సందర్భంలో అమలాపాల్ ని...మీ విడాకులకు ధనుష్ కారణం అంటూ విజయ్ తండ్రి చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటీ అంటూ ప్రశ్నించగా ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని గురించి ఇంకా ఎందుకు గుర్తు చేస్తూ మాట్లాడివ్వాలని చూస్తారు అంటూ అసహనం వ్యక్తం చేసింది.

 

మొగుడు పెళ్ళాం మధ్య విడాకులకు మరెవరో కారణం ఉండరు అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. దీంతో అమలాపాల్ వివరణ ప్రకారం తన భర్తతో విడాకులకు కారణం ధనుష్ కాదని ఇండైరెక్టుగా తెలిపింది. అయితే మరోపక్క విజయ్ తండ్రి మాత్రం తన కోడలు తన కొడుకుకి దూరం అవడానికి హీరో ధనుష్ అంటూ గట్టిగా వాదిస్తున్నాడు. మరి ఈ విషయంలో ధనుష్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఈ గొడవ ఉన్న కొద్దీ వైరల్ అవుతున్న నేపథ్యంలో చాలా మంది సోషల్ మీడియాలో అమలాపాల్ అభిమానులు ….ఇంత గొడవ జరగటానికి కారణం విడాకులు తీసుకోవడానికి కారణం ధనుష అంటూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: