ఈ టైటిల్ చదవగానే.. అబ్బా ఆ స్టార్ క్రికెటర్ ఎవరో మాకు తెలుసులెండి.. ఇంకెవరు ఆ బుమ్రానే కదా మా అనుని పడేసింది అని అనేసుకుంటారు.. అవును.. మీరు ఊహించింది నిజమే.. బుమ్రా అనుని ప్రేమలో పడేశాడు. కానీ అది లోకానికి తెలియనియ్యటం లేదు.. ఇప్పటికి గాసిప్ లనే ఉంది..    

 

సినీ విశ్లేషకులు.. సినీ అభిమానులు అనుకోవడమే తప్ప ఆ ప్రేమాయణం బయట పడేలా లేదు.. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ విషయం బయటకు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. నిజానికి బుమ్రాకు.. అనుపమకు ఎప్పటికప్పుడు లింక్ పెడుతుంటారు నెటిజన్లు. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా వేధికగా చేసే పనులు ఆలా ఉంటాయి. 

 

అందుకే సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో కాస్త తగ్గిన అను బుమ్రా.. ఇప్పుడు మళ్ళి నెటిజన్లు చేసుకొని గాసిప్స్ కి పరోక్షంగా ప్రాణం పోశాడు.. ఎలా అనుకుంటున్నారా? అదేనండీ.. మొన్న కేరళ బ్యూటీ అనుపమ పుట్టినరోజు.. దీంతో ఆవిడా ట్విట్టర్ వేధికగా ''నాకు 24 ఏళ్ళు వచ్చేశాయి'' అంటూ 24 అని ఫోటోను షేర్ చేస్తూ పెట్టింది. 

 

ఇక్కడ వరుకు అంత బాగుంది.. కానీ ఇక్కడే బుమ్రా చేసిన పనితో మరోసారి వీరిద్దరి మధ్య ప్రేమ గురించి వార్తలు తెరపైకి వచ్చాయి. బుమ్రా ఎం చేశాడు అంటే.. ట్విట్టర్ వేధికగా అతని ఫోటోలు షేర్ చేస్తూ ''డోంట్ గ్రో అప్.. ఇట్స్ ఏ ట్రాప్'' అంటూ ట్విట్ చేశాడు. అంతే ఇక.. నెటిజన్లు అంత కూడా నువ్వు ఈ ట్విట్ ఎందుకు చేశావో తెలుసులే అని కొందరు అంటే.. మరి కొందరు ట్విట్ చేస్తూ నీకెందుకయ్యా.. మా అను పాప ఎదుగుతే అంటూ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. దీంతో ఈ ట్విట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్అవుతున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: