తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ లో ఎంత హిట్ కొడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అలాంటి కాంబినేషన్ సుకుమార్ - బన్ని.  వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ సీక్వెల్ గా ఆర్య 2 మూవీ కమర్షియల్ హిట్ కాలేకపోయినా... మ్యూజికల్ హిట్ గా ఆ ఏడాది దుమ్ముదులిపేసింది. అయితే వీరి కాంబినేషన్ లో మరో మూవీ ఎప్పుడు వస్తందా అని బన్నీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.  ఈ ఏడాది త్రివిక్రమ్ - బన్నీ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా అల వైకుంఠపురములో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఈ మూవీ అనుకున్న దానికన్నా ఎక్కువే సూపర్ హిట్ అయ్యింది.  నా పేరు సూర్య లాంటి డిజాస్టర్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ఘన విజయం అందుకున్న జోష్ తో  ఉన్నారు.

 

ప్రస్తుతం ఆయన టూర్ లో ఉన్నారు.  సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు.  ఈ చిత్రం ఎర్ర చందనం సాంగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుంది. అయితే రీసెంట్ గా బ్యాంకాక్ నుండి తిరిగి వచ్చాడు బన్నీ. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన బన్నీ.. పొడవు జుట్టు, గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు.  అల వైకుంఠ పురములో ఎంతో స్మార్ట్ లుక్ తో కనిపించిన బన్ని ఈ మూవీలో కాస్త రఫ్ అండ్ టఫ్ గా కనిపించబోతున్నాడట. ఈ మూవీలో బన్ని ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్టు ఫిలిమ్ వర్గాల టాక్.

 

 ‘రంగస్థలం’ చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకున్న సుకుమార్ స్టైలిష్ స్టార అల్లు అర్జున్ తో రావడం భారీ అంచనాలు పెరిగిపోయాయి.  శేషాచలం అడవులలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రంలో టాప్ యాంకర్ అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో చిత్తూరు యాసలో మాట్లాడడానికి బన్నీ కోచింగ్ కూడా తీసుకుంటున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: