టాలీవుడ్‌లో హీరోయిన్ పాత్ర‌ల త‌ర్వాత త‌ల్లుల పాత్ర మీదే ఎక్కువ ఫోక‌స్ ఉంటుంది. ఒక‌ప్పుడు హీరోయిన్ త‌ల్లి అంటే డీ గ్లామ‌ర్‌గా మాములు చీర‌తో వ‌య‌సు అయిపోయిన‌వారు తెర మీద క‌నిపించేవారు. నెమ్మ‌దిగా నెమ్మ‌దిగా సినిమాల్లో ఎన్నో మార్పులు వ‌చ్చాయి. ఆ మార్పులు హీరోయిన్ త‌ల్లుల మీద కూడా క‌న‌పడుతుంది. ఇప్ప‌టి త‌ల్లి హీరోయిన్‌తో పాటు స‌మానంగా స్టైల్‌గా ఉంటుంది. అందంగా కూడా ఉంటుంది. పేరుకే తల్లి కాని గ్లామ‌ర్‌తో కూతురితో పోటీప‌డుతున్న త‌ల్లులు ఇప్పుడు వెండితెర‌ను ఏలుతున్నారు. త‌ల్లులు ఎంత రిచ్‌గా క‌నిపిస్తున్నారో వాళ్ళ రెమ్యూన‌రేష‌న్లు కూడా అంతే రిచ్‌గా ఉంటున్నాయి.

 

బాలీవుడ్ డ్రీమ్ గ‌ర్ల్ హేమామాలిని. గౌత‌మి పుత్ర‌శాత‌క‌ర్ణిలో హేమ మాలిని రాజ‌మాత‌గా చేసింది. గ‌తంలో చాలా మంది తెలుగు సినిమాల్లోకి ఈమెని తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేదు. అది కేవ‌లం ద‌ర్శ‌కుడు క్రిష్ వ‌ల్ల‌నే సాధ్య‌మైంది. ఈ సినిమాకి హేమ‌మాలినికి దాదాపురెండు కోట్లు రెమ్యూన‌రేష‌న్ చెల్లించారు. త‌ల్లి పాత్ర‌కి అంత రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న త‌ల్లి ఆమెనే బ‌హుశా చివ‌రి న‌టి కూడా ఆమెనే అని అంటున్నారు.

 

ర‌మ్య‌కృష్ణ ఓ ద‌శ‌లో టాలీవుడ్‌ని ఏలిన హీరోయిన్‌. హీరోయిన్‌గా విభిన్న పాత్ర‌లు పోషించ‌డంలో ర‌మ్య‌కృష్ణ త‌ర్వాతే ఎవ‌రైనా కంటే కూతుర్నే క‌ను, ఆవిడే శ్యామ‌ల‌, న‌ర్సింహా లాంటి సినిమాల్లో న‌టించి ర‌మ్య కృష్ణ‌లోని న‌ట‌న‌కు మచ్చుతున‌క‌లు అని చెప్పాలి. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ‌గా అత్త‌పాత్ర‌లు చేసినా స‌రే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాహుబ‌లి చిత్రంలోని రాజ‌మాత పాత్ర‌కి మంచి పేరు వ‌చ్చింది. ప్ర‌స్తుతం రమ్య‌కృష్ణ రోజువారి రెమ్యూన‌రేష‌న్ రెండు ల‌క్ష‌లు.

 

న‌దియా అంద‌మైన అత్త, అమ్మ పాత్ర‌లకు న‌దియా కేరాఫ్ అడ్ర‌స్ అయింది. అమ్మ, అత్త క్యారెక్ట‌ర్ల‌కు మంచి పేరు తెచ్చుకుంది. మిర్చిలో ప్ర‌భాస్‌కి త‌ల్లిగా క‌నిపించిన న‌దియా.

మరింత సమాచారం తెలుసుకోండి: