అన్న కష్టాల్లో ఉన్న ప్రతీసారి తమ్ముడు ఆదుకుంటాడు. ప్రొడ్యూసర్ గా వచ్చిన నష్టాలను పూడుస్తున్నాడు. తమ్ముడు స్టార్ డమ్ అన్నకు ఉపయోగపడుతోంది. అన్న కోసం సినిమా ఇచ్చిన ఆ స్టార్ తమ్ముడు ఎవరో కాదు ఎన్టీఆర్. 

 

ఎన్టీఆర్ ను అన్న కళ్యాణ్ రామ్ నాన్నా.. నాన్నా అంటూ ఆప్యాయంగా పిలుస్తాడు. అన్న అంటే తమ్ముడికి కూడా చాలా గౌరవం. తెలుగులో ఉన్న టాప్ స్టార్స్ లో ఎన్టీఆర్ ఒకడు. కళ్యాణ్ రామ్ ఒకవైపు నటుడిగా.. మరోవైపు నిర్మాతగా కొనసాగుతున్నా.. సక్సెస్ రేటు టాలా తక్కువ. కెరీర్ మొత్తం మీద అతనొక్కడే.. పటాస్.. 118 లాంటి మూడే హిట్స్ ఉన్నాయి. నష్టాలు వచ్చినా కెరీర్ ను సాగిస్తున్నాడు కళ్యాణ్ రామ్. 

 

పటాస్ హిట్ అయినా.. నిర్మాతగా కళ్యాణ్ రామ్ సాదా సీదా లాభాలే చూశాడు. చాలా సినిమాలు నిర్మించి నష్టపోయిన అన్నను తమ్ముడు ఆదుకున్నాడు. కళ్యాణ్ రామ్ సొంత బేనర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో తారక్ జై లవకుశ సినిమా చేశాడు. నిర్మాతగా కళ్యాణ్ రామ్ కు జై లవకుశ భారీ లాభాలు తీసుకొచ్చింది.

 

ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తాడు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ తో పాటు.. ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తోంది. ప్రొడక్షన్ లో కళ్యాణ్ రామ్ కు ఛాన్స్ ఇవ్వడం ఎన్టీఆర్ కు కూడా లాభమే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్, త్రివిక్రమ్ సపరేట్ గా రెమ్యునరేషన్ తీసుకోరని.. వచ్చిన లాభాలను రెండు వాటాలుగా వేసి.. రాధాకృష్ణ, త్రివిక్రమ్ ఒక వాటాగా.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మరో వాటాగా పంచుకుంటారట. మొత్తానికి నందమూరి సోదరులు ఇద్దరూ రక్తసంబంధికులే కాదు.. లాభనష్టాల్లో కూడా ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: