తెలుగు ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరున్ తేజ్-సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ‘ఫిదా’చిత్రం సూపర్ హిట్ అయ్యింది.  ఈ చిత్రంలో సాయి పల్లవి భానుమతి హైబ్రీడ్ పిల్లా.. ఒక్కటే పీస్ అంటూ చెప్పే డైలాంగ్ తెలుగు రాష్ట్ర ప్రజల మనసు దోచింది.  ఈ చిత్రం హిట్ తర్వాత తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది.  గత ఏడాది తమిళంలో సూపర్ హిట్ అయిన మారీ2 లో ధనుష్ సరసన నటించింది.  ఈ చిత్రం తెలుగు లో కూడా మంచి విజయం అందుకుంది.  ప్రస్తుతం రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నక్సల్ బ్యాక్ గ్రౌండ్‌లో విరాట పర్వం చిత్రం  వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సాయి పల్లవి నటనకు మరోసారి తెలుగు ప్రేక్షకుల ఫిదా కావాల్సిందే అంటున్నారు. 

 

నటిగానే కాకుండా మంచి సేవాభావం కలిగిన వ్యక్తిగా సాయి పల్లవికి మంచి పేరు ఉంది.  తాజాగా తెలంగాణ పోలీసులపై సినీ నటి సాయిపల్లవి ప్రశంసలు కురిపించింది. హైదరాబాద్ లో జరిగిన హెచ్‌ఐసీసీలో షీ ఎంపవర్‌ ఉమెన్స్‌ కాంక్లేవ్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.   సాయి పల్లవితో పాటుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ మరి కొందరు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లోని భద్రతను ఆమె ప్రస్తావించారు. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని పోలీసులు చేపట్టిన చర్యలు గ్రేట్ అంటూ కితాబిచ్చారు. దేశంలోనే హైదరాబాద్ లో మహిళలకు ఉన్న భద్రత మరెక్కడా లేదని అన్నారు.

 

ఇటీవల తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో పోలీసులు వెంటనే స్పందించడం.. కేసులు చేదించడం ప్రశంసనీయం అన్నారు.  అంతే కాదు షీ టీమ్ వల్ల మహిళలకు ఎంతో రక్షణ చేకూరుతుందని అన్నారు. చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి చాలా ప్రాంతాల నుండి మహిళలు, యువతులు ఇతర ప్రాంతాలకు వస్తారు. అయితే వారంతా ప్రతి క్షణం భయపడుతూ జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని.. కానీ హైదరాబాద్ లో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యహహరించాలని సాయి పల్లవి ప్రసంగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: