కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్  అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అలాంటి రజినీకాంత్ ఓక నటుడిని మెచ్చుకోవడం అంటే ఎంత గ్రేట్ గా భావిస్తారో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు.  పిజ్జా సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్ సేతుపతి ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో స్థాయికి ఎదిగాడు.  హీరో, విలన్ ఎలాంటి పాత్రలైనా విజయ్ సేతుపతి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు.  తెలుగు, తమిళ , మళియాళ భాషల్లో వరుసగా ఛాన్సులు దక్కించుకుంటున్నాడు విజయ్ సేతుపతి. ఇక టాలీవుడ్ లో లో సింగర్ రవి కుంచె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 

 సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు మరియు గీత రచయిత. తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలో పనిచేశాడు.    జీ.కే మోహన్ అనే స్నేహితుడు విజేత అనే టెలీఫిల్మ్ దర్శకత్వం చేస్తుంటే అందులో రఘుకు హీరోగా అవకాశం వచ్చింది. వ్యాఖ్యాత ఝాన్సీ కూడా దీని ద్వారానే బుల్లితెరకు పరిచయమైంది. తరువాత మరికొన్ని టీవీ కార్యక్రమాల్లో వరసగా అవకాశాలొచ్చాయి.  ప్రస్తుతం గాయకుడిగానూ, సంగీత దర్శకుడిగానూ కొనసాగుతున్నాడు. అహ నా పెళ్ళంట, దగ్గరగా దూరంగా, మామ మంచు అల్లుడు కంచు, లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మన్‌, దొంగాట లాంటిసినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. నాయకి సినిమాతో సంగీత దర్శకుడిగా తెలుగుతో పాటు తమిళంలోనూ అడుగుపెట్టాడు. కన్నడలో రెండు సినిమాలు చేశాడు.

 

చిరంజీవి తన మృగరాజు సినిమాలో ఒక పాటను పాడే అవకాశం కల్పించాడు. తరువాత దేశముదురు, శివమణి లాంటి చిత్రాల్లో పాడిన పాటలతో కెరీర్ మంచిగా కొనసాగిస్తున్నాడు. తాాజాగా రఘ కుంచె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " ఇప్పుడున్న జనరేషన్లో నాకు బాగా నచ్చిన నటుడు విజయ్ సేతుపతి. నటన పరంగాను .. వ్యక్తిత్వం పరంగాను ఆయన అంటే అభిమానం. ఒక వేదికపై రజనీకాంత్ గారు మాట్లాడుతూ, 'విజయ్ సేతుపతి నటుడు కాదు .. మహానటుడు అన్నారు. విజయ్ సేతుపతిని గురించి చెప్పుకోవడానికి ఆ ఒక్కమాట చాలు అని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: