తెలుగు సినిమాని రాజమౌళి లాంటి దర్శకులు తారా స్థాయిలో నిలబెట్టడానికి నానా తంటాలు పడుతుంటే కొంతమంది మాత్రం చెత్త సినిమాలు తీస్తూ అదే తెలుగు సినిమా పరువుని తీసేస్తున్నారు. బాహుబలి సినిమాని 4-5 ఏళ్ళు రాజమౌళి బృందం, ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్ లాంటి నటులు ఒళ్ళు హూనం చేసుకొని కష్ఠపడి గొప్ప సినిమాగా నిలబెడితే కొంత మంది కుర్ర దర్శకులు, హీరోలు అలాంటి గొప్ప సినిమాని ఆదర్శంగా తీసుకోకుండా హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను చూసి నానా ఛండాలమైన సినిమాలను తీసి జనాల మీదకి వదులుతున్నారు. ఈరోజుల్లో వస్తున్న ప్రతీ సినిమాలోను హీరో హీరోయిన్ మూతులు నాక్కుంటూ ముద్దులు పెట్టుకొంటేనే సినిమా హిట్ అవుతుందన్న చీప్ ట్రిక్స్ ప్లే చేసి జనాలని ఆకట్టుకోవాలని చూస్తున్నారు. సిగ్గుండాలి అలాంటి సినిమాలు తీసేవాళ్ళకి చూసే వాళ్ళకి అంటూ కొందరు సీనియర్స్ మండిపడుతున్నారు.

 

ఇప్పుడున్న సినిమాల్లో బూతు సీన్లు, లిప్ లాక్స్ తప్ప మరేమీ ఉండవా, మన బ్రతుకంతా ఇలాంటి సినిమాలు చూస్తూ బతికేయడమేనా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు ప్రముఖ కమెడియన్ ఎల్బీ శ్రీరామ్. ‘శంకరాభరణం’ సినిమా వచ్చి 40 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు సినీ ప్రముఖులు. కళాతపస్వి విశ్వనాథ్, ఎల్బీ శ్రీరామ్ గారితో పాటు ఎందరో సినీ ప్రముఖులు హాజరయ్యారు.

 

ఈ నలభై ఏళ్లలో ఏ ఒక్క దర్శకుడు కానీ నిర్మాత కానీ ‘శంకరాభరణం’ లాంటి సినిమాలు తీయలేదంటే.. మరో నలభై ఏళ్ల తర్వాత ఎవరు తీస్తారు? ఇంతసేపు మన బతుకులు లిప్ లాక్ సన్నివేశాలు ఉన్న సినిమాలు చూడటమేనా? విశ్వనాథ్ గారి పేరుతో ఓ ఇన్‌స్టిట్యూట్ పెట్టాలి. ఇప్పుడొస్తున్న సినిమాలు మంచివి కావు, వాటికి పేరు రావట్లేదు అని అనడంలేదు. ‘శంకరాభరణం’లాంటి సినిమాలు తీస్తే మన భారతీయ సినీ స్థాయి ఎక్కడికో వెళ్లిపోతుంది’’ అని తన అభిప్రాయాని తెలిపారు సీనియర్ నటులు, రచయిత ఎల్బీ శ్రీరామ్. నిజంగా చూస్తుంటే కొన్ని సినిమాలు ఆడి కోట్లల్లో డబ్బులొస్తున్నాయి. ఆ సినిమాని బాలీవుడ్ లో కూడా తెరకెక్కించి వసూళ్ళు సాధిస్తున్నారు. కానీ అలాంటి సినిమాని గొప్ప సినిమాగా చెప్పుకోగలరా ..! 

మరింత సమాచారం తెలుసుకోండి: